కొంతమంది హీరోలు అంతే. మొన్నామధ్యన మొరాకో దేశంలో జరుగుతున్న ''గౌతమీపుత్ర శాతకర్ణి'' షూటింగ్ గురించి ఒక విషయం చెప్పుకున్నాం. చక్కగా తన సెట్ లోని లైట్ బాయ్స్ తో కూర్చొని బఫే భోజనం ఆరగిస్తున్న నందమూరి నటసింహం సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు ముహూర్తాలూ గట్రా సెంటిమెంట్లు ఉన్నాయేమో గాని.. వేరే ఏ విధమైన బేదాలను ఎవరిపైనా రుద్దరు.
ఇప్పుడు మనం మరో ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. మొన్ననే బాలయ్య 100వ సినిమా మొరాకో ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వర్కు ముగించుకుని.. మొరాకో టు ఇండియా.. బయలుదేరారు బాలయ్య. ఆయనకున్న రేంజుకు.. దుబాయ్ వరకు వచ్చి.. అక్కడి నుండి ఎమిరేట్స్ విమానం లో ఫస్టు క్లాసులో రావచ్చు. అయితే బాలయ్య మాత్రం.. 3 గంటల ప్రయాణానికి ఫస్టు క్లాసు ఎందుకమ్మా క్రిష్.. హ్యాపీగా అందరం ఎకానమీలో వెళిపోదాం.. ఎందుకు డబ్బులు అనవసర ఖర్చు అంటూ ఎకానమీ క్లాసులో అబుదాబీ నుండి హైదరాబాద్ వచ్చారట.
బాలయ్యను ఎకానమీ సెక్షన్ లో కూర్చున్న కొందరు ప్రయాణికులు చూసి.. ఆయనతో ఫోటోలు దిగి.. అదేంటండీ ఫస్ట్ క్లాస్ మొత్తం ఖాళీగానే ఉందిగా అని దర్శకుడు క్రిష్ ను అడిగితే.. బాలయ్య బాబే ఎకానమీలో వెళదాం అన్నారు అని చెప్పాడట దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యతో ఫోటో దిగిన అభిమాని ఒకరు తెలియజేశారు. ఆర్టనరీ క్లాసులో ప్రయాణం చేసి.. తన మనస్సు అనేది ఎక్సట్రార్డనరీ క్లాస్ అని ప్రూవ్ చేసుకున్నాడు బాలయ్య.