స్టార్ హీరోకు భార్య బెస్ట్ ఫ్రెండ్ ఆట..!

తన భార్య నీరజ తనకు మంచి ఫ్రెండ్ అని.. ఆమె వల్లే బయట ఫ్రెండ్స్ అవసరం లేకుండా పోయిందని అన్నారు.

Update: 2024-12-27 10:06 GMT

విక్టరీ వెంకటేష్ తెర మీద ఎంత సరదాగా కనిపిస్తారో తెలిసిందే. అదేంటో సినిమాల్లో వెంకటేష్ ని చూస్తే మన మధ్య తారసపడే వ్యక్తిగా అనిపిస్తారు. కానీ ఆయన ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా హుందాగా ఉంటారు. అంటే ఈయనేనా ఇంత కడుపుబ్బా నవ్వించేది.. ఈయనేనా తెర మీద తన ఎమోషన్ తో కనీళ్లు తెప్పించేది అనిపిస్తుంది. తెర మీద హీరో ని చూసి ఇష్టపడ్డ వారు తెర వెనక కూడా అంతేలా ఉంటారనిపిస్తుంది. కానీ స్క్రీన్ ఇమేజ్ కి వెంకటేష్ రియల్ ఇమేజ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఐతే వెంకటేష్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటూ తనకంటూ క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. వెంకటేష్ ఫ్యామిలీ హీరోనే కాదు పర్సనల్ గా కూడా ఫ్యామిలీ మ్యాన్ అని తెలుస్తుంది. ఆయన ఎక్కువగా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదే విషయాన్ని బాలకృష్ణతో పాల్గొన్న అన్ స్టాపబుల్ షోలో కూడా చెప్పారు వెంకటేష్.

తన భార్య నీరజ తనకు మంచి ఫ్రెండ్ అని.. ఆమె వల్లే బయట ఫ్రెండ్స్ అవసరం లేకుండా పోయిందని అన్నారు. ఆమెతో జర్నీలు చేస్తుంటా అప్పుడప్పుడు వంట కూడా సాయం చేస్తానని మన విక్టరీ వెంకీ చెప్పిన ఫ్యామిలీ సైడ్ పర్సనల్ విషయాలు అన్నీ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశాయి. ఇక రానా గురించి కూడా చెబుతూ సూపర్ హీరో పాత్రలతో తెగ అల్లరి చేసేవాడని చెప్పిన వెంకటేష్ అల్లుడు నాగ చైతన్యని హగ్ చేసుకుంటే మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు.

ఇక ఇదే స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా తనయుడు అర్జున్ గురించి చెప్పారు వెంకటేష్. అర్జున్ ప్రస్తుతం యూఎస్ లో చదువుతున్నాడని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో తండ్రి రామానాయుడిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు వెంకటేష్. ఇక ఈ ఇంటర్వ్యూలో సంక్రాంతికి వస్తున్నాం టీం కూడా సందడి చేశారు. అనీల్ రావిపుడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా అన్ స్టాపబుల్ షోలో అలరించారు. బాలయ్య, వెంకటేష్ స్పెషల్ చిట్ చాట్ తెలుగు సినీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఆహాలో ఇప్పటికే ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ లో ఉంది.

Tags:    

Similar News