బిగ్ సీ బాలు చౌదరి డాటర్ కి పవన్ దంపతుల ఆశీర్వాదం!
బిగ్ సీ సంస్థల చైర్మన్ బాలు చౌదరి కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్ద వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
బిగ్ సీ సంస్థల చైర్మన్ బాలు చౌదరి కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్ద వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరవ్వడం విశేషం. భార్య అన్నా లెజ్ నోవా తో కలిసి పవన్ హాజరై కాబోయే దంపతుల్ని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలాగే పవన్-అన్నాలెజ్ నోవాలకు కాబోయే దంతపతులు పాద నమస్కారం చేసారు. అందమైన చీరకట్టులో అన్నాలెజ్నివా తళుక్కున మెరిసారు.
ఇక పవన్ బ్లూ జీన్స్ ప్యాంట్ పై వైట్ కుర్తా దుస్తులు ధరించారు. పవన్ ఇలా వేడుకలకు సతీసమేతంగా హాజరవ్వడం అరుదు. బేసిక్ గా ఇలాంటి వేడుకలకు పవన్ దూరంగా ఉంటారు. ఒకవేళ తప్పక వెళ్లినా? ఆయన సింగిల్ గానే హాజర వుతుంటారు. కానీ బిగ్ సీ సంస్థల చైర్మెన్ ఇంటికి కుటుంబంతో వెళ్లడం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్-అన్నా లెజ్ నోవాలను అభిమానులు చూసి ముచ్చట పడి ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వేడుకకు ఎక్కువగా రాజకీయ ప్రముఖులు హాజరవ్వడం విశేషం. ఓ సారి వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ నిశ్చితార్ద వేడుక వద్దకు చేరుకోగానే బాలు దంపతులు సాదరంగా స్వాగతించి దగ్గరుండి తీసుకొచ్చారు. అప్పటికే ఆ వేడుక వద్ద సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రెడీగా ఉన్నారు.
ఆ సమయంలో వాళ్లు కూడా నవ్వుతూ పవన్ కళ్యాణ్, అన్నాలెజ్ నోవా కి స్వాగతం పలికారు. అప్పటికే ఇంకా అక్కడ ఏపీ కూటమి నాయకులు మరికొంత మంది ఉన్నారు. అనంతరం అంతా వెళ్లి కాబోయే దంపుతుల్ని ఆశీర్వ దించారు. అటుపై నాయకులంతా కాసేపు మాట మంతి చేసుకున్నారు.