నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడంటే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మేలు చేస్తాడా చేటు చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి జనాల్లో. పబ్లిక్ మీటింగులకు ఆయన ఎలాంటి స్థితిలో వస్తాడో తెలియదు కానీ.. వేదికలెక్కి బూతులు మాట్లాడ్డం.. అభిమానుల్ని కొట్టడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాలయ్యకు చాలా మామూలు విషయం. తనపై తనకు ఎంతమాత్రం అదుపు ఉండని బాలయ్యతో ఎలా డీల్ చేయాలో ఎవ్వరికీ అర్థం కాదు.
అందరూ అనుమానించినట్లే బాలయ్య ప్రచారం వల్ల తెలుగుదేశం అభ్యర్థులకు ఒరిగిందేమీ లేదని స్పష్టమైపోయింది. ఆయన ఎవరికి ప్రచారం చేశాడన్న విషయంపై చర్చే లేదసలు. ప్రచారం చేసిన చోట్ల అభ్యర్థుల గురించి మాట్లాడింది లేదు. చంద్రబాబు భజన చేశాడు. మోడీని తిట్టాడు. ఒక దశ దాటాక కేసీఆర్ మీదా విమర్శలు గుప్పించాడు. కేవలం రాజకీయ పరమైన విమర్శలు చేస్తే సరిపోయె. కానీ చంద్రబాబు వద్దంటే శంషాబాద్ ఎయిర్ పోర్టును మూసేయండి.. ఫ్లై ఓవర్లు కూల్చేయండి అంటూ కామెడీ డైలాగులు పేల్చి నవ్వుల పాలయ్యాడు. అవేవో చంద్రబాబు సొంత డబ్బులతో కట్టినట్లుగా బాలయ్య మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనంగా నిలిచాయి.
ఇవన్నీ చాలవన్నట్లు సారే జహాసే అచ్చా గీతాన్ని ఖూనీ చేసిన తీరు మొత్తం బాలయ్య ప్రచారానికే హైలైట్. ఈ దెబ్బతో బాలయ్య ఇమేజ్ మామూలుగా డ్యామేజ్ కాలేదు. బాలయ్య పేరుతో ట్రోల్ వీడియోలు ఇప్పటికే లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ అవి చాలా వరకు సినిమాలకు సంబంధించినవే. ఇలా రాజకీయ ప్రసంగాల్లో ఇంత కామెడీ పండించడం.. ఇంతగా ట్రోల్ కావడం ఇంతకుముందు జరగలేదు. ఐతే కేవలం కామెడీనే పండిస్తే సరిపోదని.. చివరగా ఐటీ ఉద్యోగులకు చంద్రబాబు స్పెల్లింగ్స్ నేర్పించాడంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసి తెలుగుదేశం పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టాడు. మామూలుగా ఐటీవాళ్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని అంటారు. కానీ వాళ్లలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఈ దెబ్బతో బాలయ్య చివరి రోజు ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకట్ట పడింది. చివరి రోజు బాలయ్య ప్రచారం చేయాల్సిన ప్రాంతాల్లో అభ్యర్థులు ఈ నిర్ణయంగా హమ్మయ్య అనుకున్నట్లు సమాచారం. చివరి రోజు మోతాదు పెంచి ఇంకేవైనా మాటలు మాట్లాడితే తమ కొంప మునిగేదేమో అన్న భయం వాళ్లది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలయ్య చివరికి ఒక కామెడీ పీస్ గా మిగిలాడంతే.