హీరో స్మార్ట్ థింకింగ్..సిక్స్ కొట్టేలా!
ఉత్తరాది రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నింటిని 'పుష్ప-2' బ్లాక్ చేయడంతో 'ఛావా ' నిర్మాతలు సినిమాని తాత్కాలికంగా వాయిదా వేసారు.
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..ఆడితే ఆడాలిరా రప్పాడాలి! అనడానికి కూడా సమయం, సందర్భం అన్ని కలిసి రావాలి. అప్పుడే సిక్స్ కొట్టగలరు. రఫ్ ఆడగలరు. ఇటీవలే అదే ప్రూవ్ చేసింది 'పుష్ప-2'. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న పాన్ ఇండియాలో రిలీజ్ అయిన చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. 'పుష్ప-2' రిలీజ్ అవుతుందని తెలిసి ఏకంగా బాలీవుడ్ సినిమాలే వాయిదా పడ్డాయి. అందులో విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'ఛావా' ఉన్న సంగతి తెలిసిందే.
'పుష్ప'తో పాటు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ఇదేమి చిన్న సినిమా కూడా కాదు. 'ఛత్రపతి' శవాజీ కథ ఆధారంగా లక్ష్మణ్ ఉట్టేకర్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించడంతోనే అంచనాలు మొదలయ్యయాయి. అటుపై ప్రచార చిత్రాలు మరింత హీటెక్కించాయి. మడాక్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రెహమాన్ సంగీతం అందించిన చిత్రమిది. సినిమాపై నార్త్ లో భారీ అంచనాలున్నాయి. కానీ 'పుష్ప-2' రిలీజ్ తో ఈ సినిమాకి థియేటర్లు దొరకని పరిస్థితి తలెత్తింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నింటిని 'పుష్ప-2' బ్లాక్ చేయడంతో 'ఛావా ' నిర్మాతలు సినిమాని తాత్కాలికంగా వాయిదా వేసారు. వాస్తవానికి వారు చెప్పిన కారణం మరొకటి. కానీ థియేటర్లు బ్లాక్ చేయడంతోనే వాయిదా పడిందన్నది అసలు కారణంగా తెరపైకి వచ్చింది. అయితే ఇలా వాయిదా వేయడం అన్నది ఎంతో తెలివైన పని. ఉత్తమమైన పని. 'పుష్ప-2' తో గనుక ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే కిల్ అయ్యేది.
1800 కోట్ల వసూళ్లు సాధిస్తుందని సుకుమార్ కూడా అంచనా వేసి ఉండడు. ఆయన అంచనాని మించి సక్సస్ అయింది. ఇంత బజ్తో వచ్చిన సినిమాని 'ఛావా' ఏమాత్రం లైట్ తీసుకున్నా? 'పుష్ప' దెబ్బకు కన్ను లొట్టబోయేది. అంత రిస్క్ తీసుకోకుండా? వాయిదా వేసారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఆ తేదీకి మరో సినిమా కూడా రిలీజ్ కి లేదు. సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే? బాక్సాఫీ స్ వద్ద మంచి వసూళ్లకు అవకాశం ఉంటుంది.