బయోపిక్ విషయంలో బాలయ్య అప్సెట్?

Update: 2018-03-03 06:44 GMT
టాలీవుడ్ లో గత కొంత కాలంగా అందరిని ఎంతో ఉరిస్తోన్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితాన్నీ తెరపై చుపించాలని బాలకృష విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అసలు ఆ సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో గాని షూటింగ్ దశలోనే చాలా షాక్ లు ఇస్తోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ ఇవ్వలేదు.

బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సినిమాను వచ్చే ఎలక్షన్స్ లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు సినిమా స్టార్ట్ కావడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే దర్శకుడు తేజ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారని టాక్. మొన్నటి వరకు దర్శకుడి ఆలోచనలకు ఫిదా అయినా బాలయ్య టెస్ట్ షూట్ లో మాత్రం నిరాశ చెందాడట. ఈ ప్రాజెక్ట్ ను జనవరి 18న ఎన్టీఆర్ మరణించిన తేదీనాడు లాంచ్ చేశారు.

మార్చ్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ దర్శకుడి కారణంగా బాలకృష్ణ ఏ మాత్రం సంతృప్తిగా లేరట. అవసరం అయితే బాలయ్యే దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా కథ అయితే మొత్తానికి సెట్ అయ్యింది. ఇంకా క్యారెక్టర్స్ పూర్తిగా సెట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం దర్శకుడు తేజ సమయాన్నీ వృధా చేయకుండా వెంకటేష్ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనతో ఉన్నాడని టాక్. 
Tags:    

Similar News