నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం వీర సింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మాస్ కమర్షియల్ సినిమాను గోపీచంద్ మలినేని తెరపైకి తీసుకు వస్తున్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఈ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ లో అయితే అంచనాలు మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.
తప్పకుండా బాలయ్య బాబును ఫ్యాన్స్ కు నచ్చే విధంగా చూపిస్తాడు అని ఒక బలమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ కోసం కూడా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మైత్రి మూవీ మేకర్స్ ఒంగోలులో ప్లాన్ చేయబోతున్నట్లు వరకే ఒక హింట్ అయితే ఇచ్చింది.
ఇక నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వాహకులు ఒంగోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పనులు మొదలుపెట్టేశారు. ఒక పెద్ద గ్రౌండ్లో పూజ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి నట్లుగా తెలుస్తోంది. వచ్చేవారం ఈ వేడుక జరగబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు అయితే సినిమా ఈవెంట్ జనవరి 7వ తేదీన జరగవచ్చు అని ఒక టాక్ అయితే వినిపించింది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు.
ఇక ఇది అభిమానుల మాస్ జాతర అంటూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటికే విధులైన పాటలు సినిమాపై అంచనాలు స్థాయిని మరింతగా పెంచాయి. ఇక సినిమా ట్రైలర్ కోసం కూడా ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఒక విధంగా సంక్రాంతి ఫైట్.లో అయితే అందరి ఫోకస్ ఎక్కువగా ఈ సినిమా పైనే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో వీర సింహారెడ్డికి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సంక్రాంతి బరిలో భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. మరి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు డామినేట్ చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.