పలు భాషల్లో వేలాది పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యంను రజినీకాంత్ ‘పెట్ట’ చిత్ర యూనిట్ సభ్యులు అవమానించారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘పెట్ట’ చిత్ర సంగీత దర్శకుడు అనిరుథ్ లెజెండ్రీ గాయకుడైన బాలు గారిని అవమానించాడు అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కాస్త పెద్దది అవుతున్న నేపథ్యంలో స్వయంగా బాు గారు కూడా స్పందించారు.
అసలు విషయం ఏంటీ అంటే.. చాలా కాలం తర్వాత రజినీకాంత్ నటించిన సినిమాకు బాలు ఒక పాట పాడాడు. మరణ.. అంటూ సాగే ఆ మాస్ బీట్ సాంగ్ ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పాటలోని కొన్ని లైన్స్ ను మాత్రమే బాలు గారితో సంగీత దర్శకుడు అనిరుథ్ పాడివ్వడం జరిగింది. మిగిలిన పాటను ఇతర గాయకుడితో పూర్తి చేశాడు. అంత పెద్ద గాయకుడితో ఒక పాటలోని కొన్ని లైన్స్ ను మాత్రమే పాడివ్వడం ఏంటీ అంటూ బాలు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఆ పాట పూర్తిగా బాలు గారు పాడితే మరింత బాగా వచ్చేదని, అనిరుధ్ ఎందుకు ఇలా చేశాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే బాలు స్పందిస్తూ.. చాలా కాలం తర్వాత రజినీకాంత్ గారి మూవీకి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాలోని పాటలో కొన్ని లైన్స్ పాడినా కూడా నాకు పూర్తి సంతృప్తిగానే ఉందని బాలు వివాదాన్ని ముగించేలా కామెంట్స్ చేశారు. మరి బాలు అభిమానులు ఇకనైనా సైలెంట్ అవుతారో చూడాలి.