టాలీవుడ్ ఎలా ఉంది అంటే జవాబు కూడా నీరసంగా వస్తుంది. హిట్టు అన్న మాటను టాలీవుడ్ మరచిపోయింది. సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే చాలు అనుకున్నా అసలు కుదిరి చావడంలేదు. ఒక వైపు కరోనా మహమ్మారి రెండేళ్ళుగా సినిమాకు జనాలకు మధ్య అతి పెద్ద షట్టర్ ని వేసేసింది. ఈ మధ్యలో ఎన్నో జరిగిపోయాయి. సడెన్ గా ఓటీటీ దూసుకువచ్చింది. జనాలలో కూడా మార్పు వచ్చింది. ఇక ఏపీ సర్కార్ ఆన్ లైన్ టికెటింగ్ అంటోంది. ఇలా సవా లక్షా సవాళ్ళతో టాలీవుడ్ తీరని వేదన పడుతోంది.
2020లో రెండు బ్లాక్ బస్టర్లు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు గా రికార్డు అయ్యాయి. ఇక 2021లో క్రాక్ ఉప్పెన వంటి హిట్లు ఉన్నా కూడా టోటల్ గా ఇయర్ అంతా చాలా దారుణంగా జరిగిపోయింది. ఇపుడు క్లైమాక్స్ కి కధ వచ్చేసింది. గట్టిగా యాభై రోజులు కూడా మిగిలి లేవు. కాలగర్భంలోకి 2021 వెళ్లిపోతుంది. మరి ఈ ఇయర్ లో బ్లాక్ బస్టర్లు ఉండవా. అసలు ఉంటాయా అంటే జవాబు చెప్పాల్సింది డిసెంబర్ నెల మాత్రమే.
ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో బాలయ్య అఖండ మూవీ, బన్నీ పుష్ప సినిమా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ నెలలో నాని శ్యామ్ సింగరాయ్ మూవీ ఉంది. వీటితో పాటు చాలా మిడిల్ రేంజి సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే అందరి కళ్ళూ అఖండ, పుష్ప మూవీల మీదనే ఉంది. ఈ రెండు సినిమాలే టాలీవుడ్ ని కాస్తాయని నమ్మకంగా అంతా ఉన్నారు. ఈ మూవీస్ మీద అంచనాలు కూడా మించుతున్నాయి. బాలయ్య ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో వంద కోట్లు రాబడతాడా అన్న చర్చ కూడా ఉంది. ఇక బన్నీ పుష్ప అయితే పాన్ ఇండియా లెవెల్ అంటున్నారు. సో ఈ సినిమాలు కనుక గట్టిగా బ్యాటింగ్ చేస్తేనే టాలీవుడ్ కి మళ్లీ కళ వస్తుంది అంటున్నారు. లేకపోతే క్యాలండర్ లో 2021ని ఏవరేజ్ ఇయర్ గా ముద్ర వేసేసి 2022 లోకి టాలీవుడ్ వెళ్ళిపోవడమేనట.