దేవిశ్రీ ఔట్.. పర్వాలేదులెండి

Update: 2016-08-10 08:06 GMT
ప్రస్తుతం తెలుగులో దేవిశ్రీ ప్రసాదే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. అసలు ప్రస్తుతం అనేముంది.. కొన్నేళ్లుగా అతడే నెంబర్ వన్. దేవికి మిగతా వాళ్లకు అంతరం చాలా ఉంది. అందుకే తెలుగులో రాజమౌళి సినిమాల్ని మినహాయిస్తే ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మొదలైనా.. ఫస్ట్ ఛాయిస్ దేవిశ్రీనే అవుతుంటాడు. చిరంజీవి 150వ సినిమా.. బాలయ్య వందో సినిమా.. ఈ రెంటికీ కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఐతే ఇందులో బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దేవిశ్రీ చేజారినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకే పెద్ద సినిమా నుంచి దేవిశ్రీ తప్పుకున్నా ఫీలింగ్ ఇంకోలా ఉండేది కానీ.. ఈ చిత్రం నుంచి అతను వైదొలగడం మాత్రం సంగీత ప్రియులకు అంత నిరాశ ఏమీ కలిగించట్లేదు.

దేవిశ్రీ టాలెంటుని తక్కువ చేయడం కాదు కానీ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు అతడి సంగీతం సూటవుతుందా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. దేవి మాస్ ఎంటర్టైనర్లకు తిరుగులేని మ్యూజిక్ ఇస్తాడు. క్లాస్ ప్రేమకథలకూ అతడి సంగీతం బాగానే సూటవుతుంది. కానీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే చిత్రాలకు మాత్రం అతను ఇన్నేళ్లుగా ఇస్తున్న మ్యూజిక్ యాప్ట్ కాదేమో. అసలు ఇప్పటిదాకా అతను ఈ తరహా చిత్రాలకు పని చేసింది లేదు. ‘పులి’ లాంటి జానపద చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు కానీ.. రెస్పాన్స్ అంత గొప్పగా ఏమీ లేదు. అతడి పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ మోడర్న్ గా ఉన్నాయని.. ఆ సినిమాకు అంతగా నప్పలేదని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ దేవి ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో అన్న సందేహాలు కొంత వరకు ఉన్నాయి. ‘కంచె’కు సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చి ఆ సినిమాకు ప్రాణం పోసిన చిరంతన్ భట్ అయితే ‘గౌతమీపుత్ర..’కు బాగానే సెట్టయ్యే అవకాశముంది.
Tags:    

Similar News