20 ఏళ్ల సందర్భంగా బాలయ్య బెంచ్ మార్క్ మూవీ రీ రిలీజ్

Update: 2022-09-20 11:30 GMT
ఇటీవల స్టార్‌ హీరోల యొక్క పుట్టిన రోజు సందర్భంగా వారి యొక్క పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన హీరోల యొక్క పాత సినిమాలను ఎగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాత సినిమాలకు కోట్లలో వసూళ్లు నమోదు అయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన జల్సా మరియు తమ్ముడు సినిమాలు ఏ స్థాయిలో సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలయ్య అభిమానుల వంతు వచ్చింది. ఈ మధ్య కాలంలో బాలయ్య పుట్టిన రోజు లేదు.. అయినా కూడా బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకునేందుకు సిద్ధం అయ్యారు.

నందమూరి బాలకృష్ణ బెంచ్ మార్క్ మూవీ చెన్నకేశ రెడ్డి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 24 మరియు 25వ తారీకుల్లో భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో కూడా రీ రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్నారు. ఓవర్సీస్ లో రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్స్ వారు భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

బాలయ్య ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించిన దర్శకుడు వివి వినాయక్ ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త అర్థంను చూపించాడు. ఈ సినిమాలో భూమిలో నుండి వచ్చే కార్ల సన్నివేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎవర్‌ గ్రీన్ అనడంలో సందేహం లేదు.

అద్భుతమైన యాక్షన్ మూవీ గా చెన్నకేశవరెడ్డి నిలుస్తుంది. అందుకే ఆ సినిమా రెండు దశాబ్దాల ఉత్సవాలు నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్యకు ఉన్న సీడెడ్‌ ఫ్యాన్‌ బేస్ తో ఈ సినిమా భారీ గా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ రిలీజ్ లో చెన్నకేశవరెడ్డి దక్కించుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News