ప్రకాష్ రాజ్ నమస్కారానికి స్పందించని బాలయ్య!

Update: 2021-10-10 11:30 GMT
'మా' ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. ఆద్యంత రక్తికట్టించాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానళ్లు హోరాహోరీగా సాగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ రచ్చరచ్చగా జరిగాయి. కొట్టుకోవడాలు..తిట్టుకోవడాలు, విమర్శలు ప్రతి విమర్శలతో హీట్ ఎక్కింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మూడు గంటలకు ముగిశాయి. పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కు వచ్చిన సభ్యులను చూసి ఓటింగ్ ను మరో గంట పాటు 3 గంటల వరకు పొడిగించారు. పాతికేళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. దాదాపు 72శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 626 ఓట్లు పోల్ అయితే.. 60 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. తొలి రెండు గంటల్లోనే 250 ఓట్లు పోలయ్యాయి.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.మొట్టమొదటగా మా ఎన్నికల్లో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఓటు వేశాడు. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక 'మా' ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన బాలక్రిష్ణను ఆప్యాయంగా ప్రేమతో పలకరించారు. అయితే ప్రకాష్ రాజ్ పలకరించి వంగి నమస్కారం పెట్టినా కూడా బాలక్రిష్ణ పట్టించుకోకుండా మొఖం పక్కకు తిప్పుకొని వెళ్లిపోవడం కనిపించింది. కాగా 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా.. రెండు ప్యానల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్టు కనిపించారు. ఇరు ప్యానల్స్ లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశారు. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నాదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసే వాళ్లే. షూటింగ్స్ లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. 'మా' అంతిమలక్ష్యం నటీనటుల సంక్షేమం.. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం అని బాలయ్య అన్నారు.

మా ఎన్నికల్లో ఉదయం అందరికంటే ముందు వచ్చిన పవన్ తో నటుడు మోహన్ బాబు ఏకాంతంగా పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. ఇటీవల జగన్ సర్కార్ ను విమర్శిస్తూ 'మోహన్ బాబు'ను ఇన్ వాల్వ్ చేసి ఎందుకు ప్రశ్నించరని పవన్ అడిగిన సంగతి తెలిసిందే. దీనికి మోహన్ బాబు కౌంటర్ ఇస్తానన్నాడు. మా పోలింగ్ వేళ వీరిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మధ్నాహ్నం 2 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్ కు ఈసారి ఓటర్లు పోటెత్తడంతో క్యూలైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించి మరో గంటపాటు వ్యవధిని ఎన్నికల అధికారి పొడిగించారు. ఈ క్రమంలోనే 3 గంటలకు పోలింగ్ ముగియగా.. కౌంటింగ్ ప్రారంభమైంది.
Tags:    

Similar News