ట్రైల‌ర్ టాక్ : ఒంటిచేత ఊచ‌కోత కోస్తా..!

Update: 2023-01-06 15:19 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర సింహారెడ్డి. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన మూవీ ఇది. బాల‌య్య‌కు జోడీగా శృతిహాస‌న్ తొలి సారి న‌టించింది. ఇప్ప‌టికే టీజ‌ర్, లిరిక‌ల్ వీడియోల‌తో హంగామా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో ద్విపాత్రాభిన‌యం చేయ‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా శుక్ర‌వారం ఒంగోలులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఇక్క‌డే ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఫ్యాన్స్ ఏ రేంజ్ యాక్ష‌న్ అయినా బాల‌య్య నుంచి ఆశిస్తున్నారో అంత‌కు మించి అనే స్థాయిలో `వీర సింహారెడ్డి` పంగ‌డ వేళ థియేటర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేయ‌డం ఖాయం అంటూ ట్రైల‌ర్ నిరూపిస్తోంది.  

టెర్రిఫిక్ విజువ‌ల్స్ తో `సీమ‌లో ఏ ఒక్క‌డూ క‌త్తిప‌ట్ట‌కూడ‌ద‌నే నేనొక్కన్ని క‌త్తి ప‌ట్టా` అంటూ బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ప‌ర‌ప‌తి కోస‌మో పెత్త‌నం కోస‌మో కాదు.. ముందు త‌రాలు నాకిచ్చిన బాధ్య‌త‌. నాది ఫ్యాక్ష‌న్ కాదు.. సీమ మీద ఎఫెక్ష‌న్‌..వీర సింహారెడ్డి`.. అంటూ బాల‌య్య మీసం తిప్పుతున్న తీరు ఆయ‌న‌ నట విశ్వ‌రూపం థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పించేలా వుంది. పుట్టింది పులిచ‌ర్ల‌..చ‌దివింది అనంత‌పురం.. రూలింగ్ క‌ర్నూల్.. అంటూ బాల‌య్య సింహ గ‌ర్జ‌న చేస్తున్న తీరు మాస్ కి పండ‌గ వాతావ‌ర‌ణాన్ని ముందే తెచ్చేస్తోంది.

మైలు రాయికి మీసం మొలిచి న‌ట్టుండాదిరా అంటూ అజ‌య్‌ ఘోష్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఏ రేంజ్ లో సంక్రాంతి ర‌చ్చ చేయ‌నుందో హింట్ ఇచ్చేస్తున్నాయి. `అఖండ‌` త‌రువాత త‌మ‌న్ మ‌ళ్లీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో థియేట‌ర్ల‌లో స్పీక‌ర్ బాక్సులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక `మా బావ మ‌నోభావాలు పాట‌లో చంద్రిక ర‌వి పై బాల‌య్య సిగ‌రెట్ విప‌సిరేసి ర‌జ‌నీలా అంతు కోవ‌డం.. అపాయింట్ మెంట్ లేకుండా వ‌స్తే అకేష‌న్ చూడ‌నూ లొకేష‌న్ చూడ‌ను.. ఒంటి చేత్తో ఊచ‌కోత కోస్తా నా కొడ‌కా... అంటూ బాల‌య్య చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మ‌రో స్థాయిలో వున్నాయి.

ప‌గోడు పంపుతున్న ప‌సుపు కుంకుమల‌తో బ‌తుకుతుంటే ముత్తైదువులా లేనూ..ముండ‌మోపిలా వున్నా.. అంటూ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఓ రేంజ్ ర‌చ్చ చేయ‌డం ఖాయం అనిపిస్తోంది. బాల‌య్య ఇంత వ‌ర‌కు చేసిన సీమ ఫ్యాక్ష‌న్ సీన్ ల‌కు `వీర సింహారెడ్డి` ప‌తాక స్థాయిలో వుంటుంద‌ని ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. బై బ‌ర్త్ నా డీఎన్ ఏకే పొగ‌రెక్కువ అంటూ బాల‌య్య అన‌డం సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ల‌కు కొద‌వ‌లేద‌ని తెలుస్తోంది. రుషీ పంజాబీ అందించిన విజువ‌ల్స్, త‌మ‌న్ సంగీతం, బాల‌య్య న‌ట విశ్వ‌రూపం వెర‌సి పండ‌క్కి `వీరి సింహారెడ్డి` పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News