ఆకాశ్ పూరి - గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'చోర్ బజార్' సినిమా, నిన్నరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. పూరితో సినిమాలను నిర్మించడం వలన ఆయనతో బండ్ల గణేశ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ వేడుకకి హాజరైన బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. "నేను ఈ ఫంక్షన్ కి రావడానికి ముఖ్య కారణం మా వదిన లావణ్య పూరి. అమ్మ.. అక్క.. వదిన ఎలా ఉండాలంటే లావణ్యగారిలా ఉండాలి. సీతాదేవిని నేను చూడలేదుగానీ .. ఆమెకున్న ఓపిక ఈమెకు ఉంది. కుంతీదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయామెకి.
నా తల్లి తరువాత నేను ఆమెను గౌరవిస్తాను.. అంతటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆమె. ఎన్నో ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి.. పోతుంటాయి. అమ్మ ఎప్పటికీ ఉంటుంది.. జీవితాంతం ఆమెను గుండెల్లో పెట్టుకుని చూడవలసిన బాధ్యత ఆకాశ్.. పవిత్ర.. పూరి అన్నదే. పూరి స్టార్ డైరెక్టర్ అయిన తరువాత చాలామంది వచ్చారు.. ముందుగా వచ్చింది మాత్రం ఈ మహా తల్లినే. ఏదో సామెతలా పూరీగారు దేశమంతా కళ్లాపి చల్లాడుగానీ.. ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి టైమ్ లేదు ఆయనకి.
పూరి ఎంతోమందిని స్టార్స్ ను చేశాడు.. సూపర్ స్టార్స్ ను చేశాడు. డైలాగులు రానివాళ్లకి డైలాగులు.. డాన్సులు రాని వాళ్లకి డాన్సులు నేర్పించాడు. అదే నా కొడుకు సినిమా అయితే నేను లండన్ లో ఉన్నా వచ్చేవాడిని.
మరి పూరి ఎక్కడున్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో తెలియదు. అన్నా.. ఇలాంటి పని ఇంకోసారి చేయకు.. నీకు దణ్ణం పెడతాను. ఎందుకంటే మనం ఆస్తులు సంపాదిస్తే అనుభవించేది వాళ్లే.. అప్పులు చేస్తే తీర్చేది వాళ్లే. ఆకాశ్ సన్నాఫ్ పూరి జగన్నాథ్.. ఇంకొకరి పేరు రాస్తే రాజ్యాంగం ఊరుకోదు. రెస్పాన్స్ బిలిటీ తీసుకోకూడదు.. తీసుకుంటే చచ్చేవరకూ వదలకూడదు.
ఎవరెవరినో స్టార్స్ ను చేసి.. నీ కొడుకు వంతు వచ్చేసరికి పోయి ముంబైలో కూర్చున్నావ్.. ఇదెక్కడి న్యాయమన్నా. అన్నా నీ కొడుకు 'చోర్ బజార్' సినిమాలో చింపేశాడు.. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. నువ్వు చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు. నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో నిలబడే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. ఆ రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేశ్ కాదు. అప్పుడు ఆకాశ్ డేట్లు ఇవ్వకుండా నేను చేస్తాను.
మా వదిన బ్రతుకుతున్నది ఆ పిల్లల కోసం. ఆమె కలలు నిజం కావడం కోసం ఈ సినిమా హిట్ కావాలి. పూరిగారి వలన బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన వాళ్లంతా.. వందల కోట్లు సంపాదించుకున్న వాళ్లంతా వచ్చి ఈ సినిమాను ప్రమోట్ చేస్తారని అనుకున్నాను. సినిమా కదా.. ఎవరూ రారు. పూరి కొడుకు స్టార్ అయితే మనకి ఇబ్బంది.. కాకూడదనే అనుకుంటారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.