నటుడు - సినీ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో ఆయన వాయిదాకు వచ్చారు. దీంతో ఈయన కేసు వివరాలు బహిర్గతమయ్యాయి.
నటుడు - నిర్మాతగా బండ్ల గణేష్ టాలీవుడ్ అందరికీ సుపరిచితమే.. ఆయన తెలంగాణలోనే బడా పౌల్ట్రీ వ్యాపారీ. పౌల్ట్రీ రంగంలో చాలా ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దాంతోపాటు సినిమాల్లోనూ కనిపిస్తూ నిర్మాతగా మారారు. అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరి రాజకీయ నాయకుడిగా కూడా అవతారం ఎత్తారు. పైకి కనిపించిన ఈ కోణాలు ఎన్ని ఉన్నా.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆయన సుమారు 60 మందికి డబ్బులు బాకీ ఉన్న విషయం ఇప్పుడు మరోసారి బయటపడింది. ఇది చర్చనీయాంశమైంది.
ప్రొద్దుటూరుకు చెందిన సుమారు 60 మందికి బండ్ల గణేష్ పెద్ద మొత్తం బాకీ ఉన్నట్టు సమాచారం. వారి వద్ద భారీ మొత్తంలో అప్పు తీసుకున్న గణేష్ ఆ డబ్బులకు సంబంధించి ఇచ్చి చెక్కులు బౌన్స్ అయినట్టు తెలిసింది.. దీంతో మోసపోయామని వారంతా ప్రొద్దుటూరు కోర్టును ఆశ్రయించారట..
ఈ కేసు చాలా రోజులుగా జరుగుతోంది. బండ్ల గణేష్ కూడా హాజరవుతూ వస్తున్నారు. తాజాగా తిరిగి ఈ కేసులకు సంబంధించి వాయిదా రావడంతో ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల హాజరయ్యాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు కాగా.. ఆగస్టు 7కు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.