'తాతలు తండ్రులు ఉంటే సరిపోదు బ్రదర్'.. VD కి బండ్ల కౌంటర్..!

Update: 2022-07-23 05:41 GMT
'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో తన సినిమా వేడుకకు భారీగా తరలివచ్చిన అభిమానులను చూసి వీడీ ఆనందం పట్టలేక చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ డిజాస్టర్ అందుకున్న రెండేళ్ల తర్వాత వస్తున్నా తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అంటూ.. నా తాత ఎవరో మీకు తెలియదు.. తండ్రి ఎవరో తెలియదు.. అయినా ఫ్యాన్స్ ఇంత అభిమానం చూపిస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

VD ఏ హీరోని ఉద్దేశించి మాట్లాడలేదు కానీ.. పరోక్షంగా నెపోటిజం స్టార్స్ పై సెటైర్‌ వేసినట్లు అయింది. తాతలు తండ్రుల పేరు చెప్పుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటి కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. లేటెస్టుగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

''తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా.. గుర్తుపెట్టుకో బ్రదర్..'' అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీనికి మహేష్ - తారక్ - చరణ్ లను ట్యాగ్ చేశారు. ఇక్కడ బండ్ల ఎవరి పేరు ప్రస్తావించకపోయినా.. ఇది విజయ్ దేవరకొండకు కౌంటర్ అని స్పష్టం అవుతోంది.

వాస్తవానికి టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ నట వారసత్వం నుంచి వచ్చినవారే. రవితేజ - నాని - విజయ్ దేవరకొండ.. ఇలా కొందరు మాత్రమే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే నెపోటిజమ్ హీరోలైనప్పటికీ.. వారు టాలెంట్ మరియు కృషితోనే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

బ్యాగ్రౌండ్ అనేది మంచి లాంచింగ్ కోసమే ఉపయోగపడుతుంది.. కొన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత తమ సొంత టాలెంట్ ని నిరూపించుకోకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే. ఇది అనేకమంది నట వారసుల విషయంలో నిజమైంది.

అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఎలా హీరో అయ్యాడంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో విజయ్ కు మద్దతుగా నిలిచేచేవారు కూడా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు అతను కావాలని చేసి ఉండడు అని అంటున్నారు. ఒక డిజాస్టర్ తర్వాత కూడా ఫ్యాన్స్ నుంచి అలాంటి రెస్పాన్స్ చూసి ఆనందంలో అలా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.
Tags:    

Similar News