సినీ అభిమానులకు యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతోనే కాకుండా తన మాటలతో వ్యవహారశైలితో వార్తల్లో నిలుస్తుంటాడు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన బండ్ల.. మనసుకు తోచినది నిర్భయంగా మాట్లాడుతూ అప్పుడపుడు విమర్శలకు కూడా గురవుతుంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే గణేష్.. అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే తప్పు తెలుసుకుని ఓపెన్ గా క్షమాపణ కూడా చెబుతాడు. లాక్ డౌన్ సమయంలో కరోనా బారిన పడిన బండ్ల గణేష్.. ఇప్పుడు మాస్క్ ధరించనందుకు ఫైన్ కట్టి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశాయి. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అలానే బండ్ల గణేష్ కు కూడా మాస్క్ పెట్టుకోనందుకు అధికారులు రెండు వేల రూపాయలు ఫైన్ విధించారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించిన బండ్ల గణేష్.. అందరూ కచ్చితంగా మాస్క్ ధరించమని జాగ్రత్త చెబుతూ చలాన్ కాపీని షేర్ చేశాడు. అందులో మాస్క్ లేనందున రూ. 2వేలు జరిమానా కట్టినట్లు ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే బండ్ల గణేష్ 'టెంపర్' సినిమా తర్వాత మరో సినిమాని నిర్మించలేదు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో బ్లేడు గణేష్ పాత్రలో నటించాడు. ఇప్పుడు మళ్లీ ప్రొడ్యూసర్ గా మారాలని ట్రై చేస్తున్న గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడు. 'తీన్ మార్' 'గబ్బర్ సింగ్' సినిమాల తర్వాత తన అభిమాన హీరో పవన్ తో బండ్ల తీస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.