ఆ కేసులో బండ్లకు బెయిల్‌

Update: 2015-06-25 08:28 GMT
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. చెక్‌ బౌన్స్‌కేసును ఎదుర్కొంటున్న ఆయన తాజాగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌ పట్ల సానుకూలంగా స్పందిస్తూ.. బెయిల్‌ మంజూరు చేసింది. నీ జతగా నేనుండాలి సినిమాకు సంబంధించిన వివాదంపై సినీ హీరో సచిన్‌ జోషి.. బండ్ల గణేష్‌ మధ్య వివాదం నెలకొంది.

ఈ కేసుకు సంబంధించి గురువారం కోర్టుకు హాజరైన బండ్ల గణేష్‌కు బెయిల్‌ రావటంతో పాటు.. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News