వెండితెరపై తమదైన టైమింగ్ తో నవ్వించిన హాస్య నటులు హీరోలుగా రాణించిన సందర్భాలు చాలానే వున్నాయి. రాజబాబు నుంచి సునీల్ వరకు కమెడియన్ లుగా పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఆ తరువాత కాలంలో హీరోలుగా నూ విజయాలు సాధించారు. స్టార్ హీరోల తరహాలో బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకున్నారు.
ఇప్పడు ఇదే జాబితాలో మరో కమెడియన్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చేరబోతున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం `డేగల బాబ్జీ`. అయితే ఇది రెగ్యులర్ గా సాగే సినిమా కాదు. ప్రయోగాత్మకంగా ఒకే ఒక్క పాత్ర నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు.
ఒకే ప్లేస్ లో ఒకే లొకేషన్ లో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ మిగతా పాత్రల వాయిస్ లు మాత్రమే వినిస్తూ మనుషులు కనిపించకుండా చేసిన ప్రయోగాత్మక చిత్రమిది. ఈ సినిమా ద్వారా భారీ చిత్రాల స్టార్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ సరికొత్త జర్నీని ప్రారంభిస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషీ ఫిలింస్ బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన `ఉత్త సిరుప్పు సైజు 7` అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు గంటల పాటు సాగే ఈ సినిమా భారీ చిత్రాల నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేష్ కు నటుడిగా మంచి గుర్తింపుతో పాటు రెస్పెక్ట్ ని తెచ్చిపెడుతుందని అంటున్నారు.
దాదాపు 30 ఏళ్లుగా బండ్ల గణేష్ ఈ రెస్పెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారట. పార్టీబన్ కీలక పాత్రలో 2019లో విడుదలైన `ఉత్త సిరుప్పు సైజు 7` చిత్రం 62వ నేషనల్ అవార్డ్స్ లో పార్టీబన్ కు స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకుట్టికి అవార్డుల్ని అందించింది.
అలాంటి సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న బండ్ల గణేష్ కెరీర్ ని ఈ సినిమా ఏ మలుపు తిప్పుతుందో.. హీరోగా ఆయన కొత్త జర్నీ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే మే 20 వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి కథ ఆర్. పార్తీబన్, కూర్పు ఎస్ బీ ఉద్ధవ్, ఛాయాగ్రహణం అరుణ్ దేవినేని, మాటలు మరుధూరి రాజా, వైదేహి, సంగీతం లైనస్ మధిరి.