అవును.. అతడిలో అగ్నిగోళం మరుగుతోంది. భడభాగ్ని భగభగమంటోంది. వదిలితే లోకాన్ని చుట్టేసేట్టే ఉంది. అతడు వేడిగా కాగిపోతున్నాడు. కసితో రగిలిపోతున్నాడు. గరళాన్ని కంఠంలో దాచుకున్న ఈశునిలా ఉన్నాడు ఇప్పుడు. ఇంతకీ ఎవరాయన? అంటే.. ఇంకెవరు నటుడు కం నిర్మాత బండ్ల గణేష్.
తనను కాదని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కి జీవితను ప్రవేశ పెట్టడంపై అతడు మరిగిపోతున్నాడు. నిజానికి తనకు పదవి ముఖ్యం కాదు. పరువు మర్యాద ముఖ్యం. తాను దైవాలుగా భావించే మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లను కించపరుస్తూ జీవిత రాజశేఖర్ దునుమాడిన వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసి మరీ రచ్చ చేస్తున్నాడు బండ్ల. తాను జీవితకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి కారణం కూడా ఇదేనని చానెల్ లైవ్ లో బాహాటంగా ప్రకటించారు. మెగా వ్యతిరేకులను గెలిచేందుకు అతడు అంగీకరించడం లేదు.
చిరుని పవన్ ని ఎవరు ఏమన్నా బండ్ల సహించడు. కానీ గత ఎన్నికల వేళ పవన్ మీద జీవిత.. రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియోను బండ్ల ట్విట్టర్లో షేర్ చేశాడు. పవన్ బాహుబలిని మించిన ప్యాకేజీ తీసుకున్నాడంటూ రాజశేఖర్ ఆ వీడియోలో కామెంట్ చేశారు. చిరంజీవిని జీవిత విమర్శించిన వీడియోను బండ్ల షేర్ చేశాడు. చూస్తుంటే మా ఎన్నికలకు ముందు జీవిత ఇజ్జత్ తీసేందుకు బండ్ల చేయాల్సిందంతా చేస్తున్నాడనే అర్థమవుతోంది. నిజానికి ఈ వీడియోలు చూశాక జీవితకు కానీ రాజశేఖర్ కి కానీ మెగాభిమాని అయిన నటీనటులెవరూ కచ్ఛితంగా ఓట్లు వేయరు. అంతగా బండ్ల ఝలకిస్తున్నాడు. అతడు ప్రస్తుతం కోపంతో రగిలిపోతున్నాడు. దావాగ్నిలా మరిగిపోతున్నాడు.
అన్నట్టు తనను అంతగా కించపరిచినా మెగాస్టార్ చిరంజీవి జీవితను ఎందుకని క్షమించినట్టు? ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరాలని ఎందుకని పిలుపునిచ్చారు? శత్రువుతో అయినా సయోధ్యను కోరే మంచితనం మెగా బాస్ లో ఎందుకు? అంటూ మెగాభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇకపోతే ఇండస్ట్రీ పెద్దగా క్రమశిక్షణా సంఘం మెంబర్ గా చిరు అసలు ఎంఏఏ రాజకీయాల్లో తలదూర్చడం లేదా? అన్న సందేహం కూడా మరోవైపు కలుగుతోంది. అందుకే జీవితను ప్రకాష్ రాజ్ కలుపుకుని పోతున్నారా? అన్నది అర్థం కావడం లేదు. సిసలైన మెగాభిమానిగా బండ్ల మాత్రం తాను చేయాల్సినదంతా చేస్తున్నారు. తన ఆరాధ్య దైవాలకు శత్రువులు ఎవరైనా కానీ చీల్చి చెండాడే పనిలో నిమగ్నమై ఉన్నారు!!
అక్టోబర్ 10న `మా` ఎన్నికలు అయ్యేవరకూ..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని మెగాస్టార్ చిరంజీవిని దేవుళ్లుగా భావించే బండ్ల గణేష్ కి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో స్థానం లేకపోవడమేమిటి? ఇప్పుడు అదరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. మెగాహీరోలను పొలిటికల్ గా జీవిత పదే పదే విమర్శించిన సందర్భాల్ని గుర్తు చేసుకుని ఆయన నేడు ఎమోషన్ అయిన తీరు `మా` అసోసియేషన్ 950 మంది సభ్యుల్లో చర్చకు వచ్చింది. అక్టోబర్ 10న జరగనున్న `మా` ఎన్నికలు అంతకంతకు వేడెక్కిస్తున్న వేళ `బండ్ల వర్సెస్ జీవిత` ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. అయితే మెగా అండదండలతో బరిలో దిగుతున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై తనకు సభ్యత్వం దక్కకపోగా అందులో జీవిత రాజశేఖర్ పోటీ చేయడాన్ని బండ్ల జీర్ణించుకోలేకపోతున్నారు.
జీవితను ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి ఆహ్వానించడమేమిటని బండ్ల అలిగారు. తీవ్రంగా హర్టయి ప్యానెల్ లో తనకు అప్పగించిన బాధ్యతలనుంచి వైదొలిగారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు కాబట్టి పట్టుబట్టి స్వతంత్రుడిగా అదే పదవికి తాను కూడా పోటీపడతానని బండ్ల ప్రకటించారు. అయితే జీవిత మాత్రం తనకు బండ్ల గణేష్ కి మధ్య విభేధాలు ఏవీ లేవని తాను కూడా `మా`కు సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి పోటీకి దిగుతున్నారని అది తప్పేమీ కాదని అన్నారు. అయితే ఏ కారణం వల్ల బండ్ల తప్పుకున్నానని చెప్పారో దాని గురించి నామ మాత్రంగా అయినా జీవిత ప్రస్థావించకపోవడం గమనార్హం. ``నాకు వ్యతిరేకంగానో నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా కలిసే పనిచేస్తాం. గెలిచినా ఓడినా అసోసియేషన్ కోసం పనిచేస్తాం`` అని జీవితా రాజశేఖర్ అనడం కొసమెరుపు.