'మండేలా' రీమేక్ లో బండ్ల గణేష్..?

Update: 2021-04-26 11:53 GMT
కోలీవుడ్‌ స్టార్ కమెడియన్‌ యోగిబాబు టైటిల్‌  రోల్ పోషించిన సినిమా ''మండేలా''. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ తమిళ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. నటుడిగా యోగిబాబుకు మరింత పేరుని తెచ్చిపెట్టింది. తమిళనాడు నాయీ బ్రాహ్మణుల సంఘం తమ మనోభావాలను దెబ్బ తీసారంటూ పోలీస్‌ కమీషనర్‌ కు ఫిర్యాదు చేయడంతో ఈ సినిమాపై వివాదం కూడా చెలరేగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగు రీమేక్‌ రైట్స్ కోసం ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

'మండేలా' రీమేక్ హక్కులు దక్కితే బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా అందులో టైటిల్‌ పాత్రలో నటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే ఈ మధ్య నటనకు దూరమైన బండ్ల గణేశ్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'మండేలా' తెలుగు రీమేక్ పై క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే నటుడిగా బిజీగా ఉన్న సమయంలో బండ్ల గణేష్ 'పరమేశ్వర ఆర్ట్స్' బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. పలు సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన బండ్ల.. 'టెంపర్' సినిమా తర్వాత మరో సినిమాని నిర్మించలేదు. అయితే గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో బ్లేడు గణేష్ అనే చిన్న పాత్రలో నటించాడు. అలానే మళ్లీ నిర్మాతగా బిజీగా మారాలని ట్రై చేస్తూ.. పవన్‌ కళ్యాణ్‌ తో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Tags:    

Similar News