టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్.. ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పవన్ కళ్యాణ్ - రవితేజ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు. అయితే 2015లో వచ్చిన 'టెంపర్' సినిమా తర్వాత బండ్ల మరో సినిమా నిర్మించలేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. ఇప్పుడు నిర్మాతగా బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు తెలియనప్పటికీ పవన్ లైనప్ లో బండ్ల సినిమా ఉంటుందనేది కంఫర్మ్ అయింది.
అయితే పవన్ తో పాటు మరో ఇద్దరు మెగా హీరోలతో కూడా బండ్ల గణేష్ సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ లకు ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. కానీ స్టార్ హీరోలను లైన్లో పెట్టిన బండ్ల గణేష్ కి టాప్ డైరెక్టర్స్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు. అందరూ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి బిజీగా ఉన్నారు. అందులోనూ బండ్ల గణేష్ డైరెక్టర్ హరీష్ శంకర్ మీద కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత మళ్ళీ హరీష్ కి సారీ చెప్పడం వంటి కారణాలతో మరికొందరు డైరెక్టర్స్ ముందుకు రావడం లేదని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మెగా ప్రాజెక్ట్స్ ని బండ్ల గణేష్ ఏ దర్శకులతో సెట్ చేస్తాడో చూడాలి.