మన దేశంలో స్టార్టప్ ల హంగామా ఎక్కువగా ఉండే నగరం బెంగళూరు. ఐటీ రంగం బాగా డెవలప్ అయిన ఈ మెట్రో సిటీలో.. కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. మరి సినిమాల్లో సత్తా చాటుతూ ఇతర బిజినెస్ లకు ప్రచారం చేస్తున్న కొందరు తారలు.. తామే ఎందుకు సొంత వ్యాపారం పెట్టుకోకూడదనే ఆలోచన చేస్తున్నారు. అందుకే తమ ఇమేజ్ ని ఉపయోగించుకుంటూ తామే సొంతగా స్టార్టప్ పెట్టేసి, బిజినెస్ లు మెదలుపెట్టేస్తున్నారు.
పవన్ తో అత్తారింటికి దారేది తర్వాత ప్రణీత ఇక్కడ బాగా ఫేమస్ అయిపోయింది. కానీ ఈ కన్నడ చిన్నది.. ఇప్పుడు బెంగళూరులో ఓ కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేసేసింది. బిజినెస్ చేస్తున్నంత మాత్రాన సినిమాలు వదిలేసినట్లు కాదని.. ఇప్పుడు బెంగళూరులో ఉన్న స్టార్టప్ కల్చర్ ను తానెందుకు ఉపయోగించుకోకూడదనే ఆలోచనతోనే ఇలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశానంది ప్రణీత. బ్రూస్ లీలో చెర్రీకి అక్కగా నటించిన కృతి కర్బందా అయితే.. 'క్రితి' పేరుతో ప్రైవేట్ డిజైనర్ లేబుల్స్ బిజినెస్ మొదలు పెట్టేసింది. అంతే కాదు.. త్వరలో మీల్స్ ఆన్ వీల్స్ అంటూ త్వరలో ఫుడ్ బిజినెస్ లోకి కూడా దిగుతోందట.
ఇక కిల్లింగ్ వీరప్పన్ మూవీతో బాగా ఫేమస్ అయిన పరుల్ యాదవ్.. ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ చేస్తోంది. ఈ స్టార్టప్ ని త్వరలో హైద్రాబాద్ లో మొదలు పెట్టనున్నట్లు చెప్పిందీ పాప. గతేడాది కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రమ్య అయితే.. స్పందన పేరుతో ప్రైవేట్ లేబుల్ వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తోంది. తన డిజైన్లను ప్రదర్శిస్తూ ఓ స్టోర్ ఏర్పాటు చేసింది దీపికా కామయ్య. హర్షిక పూనచా - ప్రగ్నలకు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలున్నాయి. మొత్తానికి బెంగళూరు భామలు వ్యాపారాల్లోనూ బాగా ముదిరిపోతున్నారు.