అక్కినేని హీరోలంతా కలిసి నటించిన `మనం` ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు- కింగ్ నాగార్జున- యువసామ్రాట్ నాగచైతన్య - సమంత అక్కినేని - అఖిల్ లాంటి స్టార్లు `మనం`లో నటించారు. అక్కినేని ఫ్యామిలీ ఫ్రేమ్ వర్ణరంజితం మహదాద్భుతం అంటూ ప్రశంసలు దక్కాయి. విక్రమ్.కె పనితనానికి గొప్ప గుర్తింపు గౌరవం దక్కింది. మనం చిత్రం అవార్డులు రివార్డులు కొల్లగొట్టింది.
ఆ తర్వాత మనం లాంటి మరో సినిమా చేసేందుకు అక్కినేని కాంపౌండ్ సాహసించలేదు. అలాగే దర్శకులు వద్ద అలాంటి స్క్రిప్టులు లేవు. కానీ నాగార్జున-నాగచైతన్య- సమంతలను కలుపుతూ కళ్యాణ్ కృష్ణ `బంగార్రాజు` స్క్రిప్టును రాసుకున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. మనం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి ఒప్పించారు. కానీ అనూహ్యంగా సమంతకు ఈ చిత్రంలో స్కోప్ లేదని చైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుందని ప్రకటించడంతో అక్కినేని అభిమానులు నిరాశపడ్డారు. నాగచైతన్య- సమంత జంట మరోసారి మజిలీ సన్నివేశం రిపీట్ చేస్తారని భావిస్తే అందుకు ఆస్కారం లేదని తెలియడంతో ఫ్యాన్స్ కలత చెందారు. సోగ్గాడే చిన్న నాయనా 2016లో రిలీజైంది. ఇంతకాలానికి ఆ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి చైతూకి జంటగా నటిస్తుండగా రమ్య కృష్ణ సహా మరో హీరోయిన్ కూడా నాగ్ కి జతగా నటించనున్నారు.
ఇకపోతే చైతన్య - సమంత జంట మునుముందు సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. చైతన్య నటించిన లవ్ స్టోరి త్వరలో రిలీజ్ కానుంది. సమంత ఇటీవలే `శాకుంతలం` చిత్రీకరణను ముగించి తదుపరి విరామంలో ఉన్నారు. నయన్ -విఘ్నేష్ ల తమిళ ప్రాజెక్ట్ లోనూ సామ్ నటించిన సంగతి తెలిసినదే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి రానుంది.
ఐదేళ్లుగా ఫ్యాన్స్ వెయిటింగ్...
కింగ్ నాగార్జున కథానాయకుడిగా `సోగ్గాడే చిన్ని నాయనా` లాంటి మాస్ హిట్ చిత్రం వచ్చాక ఐదేళ్లుగా ఈ సినిమా ప్రీక్వెల్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉంది. నాగ్ వేరే స్క్రిప్టులపై దృష్టి సారించడం తో కళ్యాణ్ మరో సినిమాని చేయలేకపోయారు. మళ్లీ ప్రారంభమవుతుంది అనగానే రెండుసార్లు కరోనా ప్రజలపై దాడి చేసింది. దానివల్ల కూడా ఇది ఆలస్యమైంది. ఎట్టకేలకు `బంగార్రాజు` టైటిల్ తో ప్రీక్వెల్ సెట్స్ పైకి వెళుతోంది. 2016లో సోగ్గాడే రిలీజైంది. ఐదేళ్లకు కానీ సెట్స్ పైకి వెళ్లలేని పరిస్థితి. ఆలస్యమైనా కానీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 న ప్రారంభమవుతుంది. ఈ నెల 20న లాంఛనంగా మొదలవుతుంది.
సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు మరణం తర్వాత అతడి పాత్ర తీరు తెన్నులను చూపించారు. కానీ ఇప్పుడు `బంగార్రాజు`లో అతని మరణానికి ముందు కథను తెరపై చూపనున్నారు. ఇక ఈ సినిమాలో స్వర్గం నరకం సన్నివేశాలను కూడా చూపిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో నిర్మించిన సెట్లలో నాగ్ సహా కీలక నటీనటులపై కళ్యాణ్ కృష్ణ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. తదుపరి మీడియాకి అధికారికంగా వివరాల్ని వెల్లడిస్తారని తెలిసింది. నాగార్జున ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్రను పోషిస్తోంది.