'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో సంక్రాంతి అల్లుడు అనిపించుకున్న కింగ్ అక్కినేని నాగార్జున.. ఈసారి పండక్కి ''బంగార్రాజు'' చిత్రంతో తనయుడు నాగచైతన్యతో కలిసి వస్తున్నాడు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' సినిమాలు వాయిదా పడటంతో.. సంక్రాంతిని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలని నాగ్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనవరి 14న తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ - సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు'.. ఇది పండుగలాంటి సినిమా అని చెబుతూ ఇప్పటికే ప్రమోషన్స్ తో సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. ఇక ఏపీలో టికెట్ రేట్ల అంశం మీద నాగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారడంతో సోషల్ మీడియాలో 'బంగార్రాజు' ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడతామని అక్కినేని హీరోలు ధీమాగా ఉన్నారు.
కాకపోతే ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కానందున ''బంగార్రాజు'' ఫైనల్ కాపీ ఇంకా రెడీ కాలేదని టాక్ వినిపిస్తోంది. సినిమా సెన్సార్ కాపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అందులో కొంత సీజీ వర్క్ చేసి ఫైనల్ టచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులోనూ ఈ సినిమాలో సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ కి ఆస్కారం ఉంది. సినిమాలో 30 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉంటుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' ఫైనల్ కాపీ వీలైనంత త్వరగా రెడీ చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో టీం అంతా పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడానికి ఎంత సమయం పడుతుందో టెక్నికల్ టీం ని అడిగి తెలుసుకున్న తర్వాతే నాగార్జున విడుదల తేదీని ప్రకటించినట్లు వెల్లడించారు. నాగ్ కి చెప్పిన టైంకి సినిమాను అందించడానికి అన్నపూర్ణ టీమ్ ఫుల్ ఫోకస్ తో వర్క్ చేస్తోందని తెలుస్తోంది. ఇకపోతే సంక్రాంతికి రిలీజ్ కానున్న మరికొన్ని సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతున్నాయి.
కాగా, 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా 'బంగార్రాజు' తెరకెక్కుతోంది. అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున - నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.