నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలతో పాటు ఇంకా పలు పెద్ద సినిమాలు వస్తాయని అంతా భావించారు. కాని ఆ సినిమాలకు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగిలింది. ఉత్తర భారతంలో ఆ సినిమాలు విడుదల అవ్వాల్సి ఉంది. అక్కడ భారీ ఎత్తున కరోనా కేసులు ఉన్నాయి కనుక ఆంక్షలు విధించారు. దాంతో అక్కడ సినిమాల విడుదల కష్టంగా మారింది. అందుకే రాధేశ్యామ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు వాయిదా పడ్డాయి. ఆ సినిమాలు వాయిదా తో బంగార్రాజు సినిమా ను జెట్ స్పీడ్ తో ముగించి విడుదలకు సిద్దం చేయడం జరిగింది.
బంగార్రాజు సినిమాకు విడుదల తేదీ ప్లస్ అని చెప్పుకోవాలి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. సినిమా మొదటి రోజు వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మొదటి ఆట కాస్త డల్ గా అనిపించినా టాక్ పాజిటివ్ గా రావడం మరియు మెల్ల మెల్లగా సినిమా గురించిన చర్చ జరగడం వల్ల రెండవ ఆట నుండి వసూళ్లు పెరిగాయి. మొదటి రోజు మొదటి ఆట మినహా మిగిలిన మూడు ఆటలకు కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ బంగార్రాజుకు దక్కినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
ఇక బంగార్రాజు మొదటి రోజు వసూళ్లతో పోల్చితే రెండవ రోజు చాలా ఎక్కువగా వచ్చినట్లుగా తెలుస్తోంది. 70 శాతం ఆక్కుపెన్సీ రెండవ రోజు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ అయినట్లుగా కూడా టాక్ వచ్చింది. మొత్తానికి బంగార్రాజు సినిమా మొదటి రోజు తో పోల్చితే రెండవ రోజు.. రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు వసూళ్లు అధికంగా ఉంటాయని ముందు నుండే కొందరు ఊహించారు.. ఊహించినట్లుగానే వసూళ్లు బంగార్రాజు దక్కించుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.