తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్స్ తర్వాత మీరే

Update: 2022-01-07 08:30 GMT
కరోనా ను రెండేళ్ల పాటు విజయవంతంగా ఎదుర్కొన్నాం... మన దేశంలో కరోనా అడుగు పెట్టి రెండేళ్లు పూర్తి అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం వల్ల చాలా దేశాలతో పోల్చితే మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంటున్నాయి. కరోనా ఫస్ట్‌ వేవ్‌ మరియు సెకండ్‌ వేవ్‌ సమయంలో ఇండియన్స్ పాటించిన జాగ్రత్తల వల్ల కేసుల సంఖ్య మితంగా ఉంది.. మృతుల సంఖ్య భారీగా పెరగలేదు. ఇప్పుడు థర్డ్ వేవ్‌ రాబోతుంది. ఈ థర్డ్ వేవ్‌ దేశ వ్యాప్తంగా మునుపటి వేవ్స్ తో పోల్చితే మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. ఎవరిని కలువకుండా జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలకు మరియు స్టార్స్ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవుతుంది. స్టార్స్ తర్వాత కరోనా సోకేది సామాన్యులకే కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం మంచిది.

టాలీవుడ్‌ కు చెందిన మహేష్‌ బాబు.. నితిన్ భార్య షాలిని.. మంచు లక్ష్మి.. వరలక్ష్మి ఇంకా పలువురు కరోనా బారిన పడ్డారు. వీరి వీరి కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరు ఇద్దరు కరోనా పాజిటివ్ గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడవ సీజన్ ముంచుకు వస్తుంది అనేందుకు ఇదే సాక్ష్యం అనిపిస్తుంది. మహేష్ బాబు వంటి పెద్ద స్టార్‌ సహజంగా అయితే ఎక్కువ శాతం మాస్క్ తోనే కనిపిస్తూ ఉంటాడు. ఆయన బయట చాలా తక్కువగా ఉంటాడు. అలాంటి మహేష్ బాబుకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రెటీలు మరింత మంది కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

తమిళ నటి వరలక్ష్మి కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. షూటింగ్‌ లు మళ్లీ ఆగి పోతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. థర్డ్‌ వేవ్ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం షూటింగ్ లకు అంతరాయం తప్పదేమో అంటున్నారు. వరలక్ష్మి ఇటీవలే ఒక షూటింగ్‌ లో జాయిన్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. రెండు మూడు రోజుల షూటింగ్‌ కూడా చేసింది.

ఆ సమయంలో వరలక్ష్మి కి కరోనా ఎటాక్ అయ్యి ఉంటుందా లేదా అంతకు ముందే ఆమెకు కరోనా సోకి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఎలా అయినా కూడా ఆ సినిమా సెట్‌ లో మరికొందరికి కూడా వరలక్ష్మి ద్వారా మరో పద్దతి ద్వారా అయినా కరోనా సోకి ఉంటుంది. ఇలా కరోనా మరింతగా విస్తరిస్తూ ఉంది. అందుకే ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలు అయ్యింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సామాన్యులు.. ఆఫీస్ లకు వెళ్లే వారు.. వేరు వేరు పనులు చేసుకునే వారు జాగత్రగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీ వారు కరోనాతో పోరాటం చేస్తున్న ఈ సమయంలో తదుపరి పోరాడాల్సింది మీరే అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండండి.



Tags:    

Similar News