టాలీవుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి నటిస్తోన్న తాజా చిత్రం `మను చరిత్ర`. ఇందులో మేఘా ఆకాష్- ప్రియ వడ్లమాని- శ్రీవాత్సవ హీరోయిన్లగా నటిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ సమరపణలో ప్రొద్దుటూర్ టాకీస్ పై నరాల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. రాన్సన్ జోసెఫ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
అలాగే కాజల్ రిలీజ్ చేసిన 'ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల' అనే పాట లిరికల్ వీడియోకి శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది.క్లాస్ మాస్ తో పాటు అన్ని వర్గాలకు పాట రీచ్ అయింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ``కనబడకనే తెగ తిరుగుతు నను వెతికిన తుంసే మేరా ప్యార్ హువా..పద పదమని నీవెనుకనే నను కదిపిన దిల్ సే మేరా ప్యార్ హువా`` అంటూ సాగే మెలోడీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గోపీ సుందర్ మార్క్ మెలోడీగా కనెక్ట్ అవుతుంది. చక్కని ట్యూన్స్ ..సాహిత్యం కుదిరాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని శివ వెయిట్ చేస్తున్నాడు.
`చూసి చూడంగానే` అనే సినిమాతో శివ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా శివ అంచనాల్ని అందుకోలేకపోయింది. గమనం అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇది తెలుగు..తమిళ్ కన్నడలో తెరకెక్కుతోంది.ఇందులో నిత్యామీనన్..శ్రియ..ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు. కంటెట్ బేస్డ్ చిత్రమిది. శివ రోలా ఎలా ఉంటుందన్ని తెలియాలి. అయితే సోలో హీరోగా నటిస్తోన్న `మను చరిత్ర`పైనే శివ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Full View