హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ - గార్జియస్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "సీతా రామం". 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది.సెన్సిబుల్ లవ్ స్టోరీల స్పెషలిస్ట్ హను రాఘవపూడి ఈ రొమాంటిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దత్ - ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.
'సీతా రామం' చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన టైటిల్ గ్లింప్స్ మరియు 'ఓ సీత హే రామ' ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా టీజర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది.లెఫ్టినెంట్ రామ్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. 'కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు.. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం.. కనీసం ఒక ఉత్తరం రాయడానికి పరిచయమున్నోళ్లు లేరన్న విషయం నిన్నే నాకు తెలిసింది..' అంటూ రామ్ భార్య అని చెప్పుకునే సీతా మహాలక్ష్మి నుండి ఓ ఉత్తరం వస్తుంది. ఆ తర్వాత వేల కొలదీ లెటర్స్ వస్తున్నాయి.
'నీకు ఎవరూ లేరా? ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని పూర్తిగా మర్చిపోయినట్లున్నావ్? నిన్నే గుర్తు చేసుకుంటూ..' అంటూ మరో ఉత్తరం ద్వారా చెబుతోంది. హీరోయిన్ మృణాల్ పాత్ర పేరు సీత అయినప్పటికీ.. ఆమె ఇంట్రడక్షన్ సీన్ లో దుర్గ మా వలె కనిపించింది.'సీతా రామం' అనేది 1965 బ్యాక్‌డ్రాప్ లో సెట్ చేయబడిన మ్యాజికల్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రధాన జంట చాలా చూడముచ్చటగా ఉంది.
కాశ్మీర్ అందాలను సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా అత్యుత్తమంగా ఉంది. దీనికి శ్రేయాస్ కృష్ణ అదనపు సినిమాటోగ్రఫీని అందించారు. విశాల్ చంద్రశేఖర్ తన స్కోర్ తో విజువల్స్ స్థాయిని పెంచాడు. .మొత్తం మీద అద్భుతమైన పెర్ఫార్మన్స్ - ఆకట్టుకునే కథనం - అందమైన విజువల్స్ మరియు వినసొంపైన సంగీతంతో ఒక ఎపిక్ లవ్ స్టోరీగా 'సీతా రామం' సినిమా ఉండబోతోందని టీజర్ సూచిస్తోంది.
యుద్ధ నేపథ్యంలోని ఈ అందమైన ప్రేమకథ చిత్రంలో సుమంత్ - గౌతమ్ మీనన్ - ప్రకాష్ రాజ్ - భూమికా చావ్లా - తరుణ్ భాస్కర్ - శత్రు - రుక్మిణి విజయ్ కుమార్ -సచిన్ ఖేడేకర్ - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. వైష్ణవి రెడ్డి - అలీ థాట్స్ ఆర్ట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'సీతారామం' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Full View