బేఫికర్ బ్లాక్ బస్టరే.. ఎందుకంటే..

Update: 2016-12-14 12:46 GMT
బేఫికర్.. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఉన్నా.. వాటిని అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయిందనే విషయం ఒప్పుకోవాల్సిందే. జనాలు ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో సినిమాలో కంటెంట్ లేకపోవడం.. అందులో ఉన్న కంటెంట్ ని జనాలు రిసీవ్ చేసుకోలేకపోవడంతో.. బాక్సాఫీస్ ని షేక్ చేసే మూవీ కాదని తేలిపోయింది. అయితే.. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాల్లోకి వచ్చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు.

బేఫికర్ మూవీ కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు.. 55 కోట్లు.. మరో 15 కోట్లను పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజింగ్ కోసం ఖర్చు చేశారు. అంటే బేఫికర్ పై మొత్తం ఖర్చు 70 కోట్లు. ఇండియాలో మొదటి నాలుగు రోజులు ముగిసేసరికి ఈ మూవీకి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 17.83 కోట్లు. ఓవర్సీస్ నుంచి ఓపెనింగ్ వీకెండ్ లో వచ్చిన షేర్ రూ. 5.58 కోట్లు. ఈ లెక్కలు చూస్తే నష్టం తప్పదనే అనిపిస్తుంది. కానీ బేఫికర్ కు మ్యూజిక్.. ఇన్ ప్లేస్మెంట్ యాడ్స్ - మర్కెండైజింగ్ - లైసెన్సింగ్ - యాన్సిలరీ రైట్స్ రూపంలో 15 కోట్లు గిట్టాయి. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో రూ. 50 కోట్లు వచ్చేశాయి.

అంటే ఇప్పటికే ఈ మూవీకి మొత్తం రూ. 110.21 కోట్లు వచ్చేశాయన్న మాట. పెట్టుబడి 70 కోట్లను తీసేస్తే.. ఈ పాటికే నిర్మాతలకు రూ. 40.21 కోట్ల లాభాలు వచ్చాయి. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే పెట్టుబడిపై 58 శాతం రిటర్నులు ఇచ్చిన సినిమాని బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి తప్పులేదు కదా!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News