ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తెరకెక్కించి ఇండియా నంబర్ -1 సినిమాని అందించిన ఘనుడిగా ఖ్యాతినార్జించాడు. అయితే అంతటి మొనగాడు ఇంతవరకూ భారతీయ సినిమా చరిత్రలోనే లేడా? అంటే ఉన్నాడనే చరిత్ర చెబుతోంది. ఈరోజు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటివాడో, ఆ రోజుల్లో ఎస్.ఎస్.వాసన్ కూడా అంతటివాడేనని చెబుతున్నారు. ఈ ఇద్దరూ ఆయా సీజన్స్, సమయాల్లో భారీ బడ్జెట్ లతో సంచలనాత్మక చిత్రాల్ని తెరకెక్కించారు. గొప్ప విజన్ తో అనుకున్న లక్ష్యాల్ని చేరుకున్నారు.
= ఎస్.ఎస్.వాసన్ జెమిని స్టూడియోస్ పతాకంపై ఆ రోజుల్లోనే 'చంద్రలేఖ' అనే భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించాడు. ఆరోజుల్లోనే మూడు మిలియన్ల (30లక్షలు) రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఆయన సొంతం. ఆ పెట్టుబడి ఈరోజులతో పోలిస్తే 300కోట్లతో సమానం. 1943 నుంచి ఐదేళ్ల పాటు అకుంఠిత ధీక్షతో శ్రమించి 1948 నాటికి సినిమాని పూర్తి చేశారు. టి.ఆర్.రాజకుమారి, రాజన్ ఈ చిత్రంలో నటీనటులు. అమెరికాలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజైన తొలి భారతీయ చిత్రమిది.
= 500మంది డ్యాన్సర్ల తో ఓ డ్రమ్ డ్యాన్స్ ని ఈ సినిమా కోసం కొరియో గ్రాఫ్ చేశారు జయశంకర్ అనే కొరియో గ్రాఫర్. ఆ రోజుల్లో అది అసాధారణ ఫీట్. 6నెలలు డ్యాన్సర్లంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వందల మత్త గజాల్ని తోలుకొచ్చి ఈ సినిమాలో నటింపజేశారు. దానికోసం పేరున్న సర్కస్ వాలాలు రంగంలోకి దిగారు. ఆ తర్వాత జెమిని సర్కస్ పేరుతో ఆ ఏనుగుల గుంపుతో పాటే సర్కస్ బ్రాండ్ ఇండియా అంతటా ఫేమస్ అయ్యింది. కె.బి.సుందరం భాయ్ అనే కర్నాటిక్ సంగీత విద్వాంసుడికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసినందుకు ఆ రోజుల్లోనే లక్ష చెల్లించుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
= ఓ వీధిలో 10వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ వీధిలో జరిగే సన్నివేశం తెరకెక్కించడానికి లక్షన్నర ఖర్చు చేశారంటే నమ్మగలరా?
=అవ్వయ్యార్ ప్రార్థన (కథానాయకుడి ప్రార్థన) సమయంలో ఏనుగులు కోట గోడని ఢీకొట్టే సన్నివేశంకోసం ఎంతో శ్రమించారు. కేరళ వాయలార్ ప్రాంతం నుంచి ఏనుగుల్ని రప్పించేవారు. ప్రతి ఉదయం వేకువఝామునే వీటిని షూటింగ్ కోసం వినియోగించేవారు.
=మార్కెటింగ్ లోనూ వాసన్ శైలి డిఫరెంట్. ఆ రోజుల్లో శుభలేఖలు తరహాలో ఇన్విటేషన్లు ప్రింట్ చేసి మహిళలకు ఇచ్చి సినిమా చూడమనేవారు.
=ఏ కోణంలో చూసినా వాసన్ రాజమౌళిని మించినవాడు. ఆ రోజుల్లోనే అతడి సాహసాలు అసాధారణం. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ?