రాహుల్ పై ఇప్పుడంత ఫ్యాసినేషన్ లేదు

Update: 2018-10-01 14:34 GMT
కాంగ్రెస్ పార్టీ వారేమో యువరాజు.. కాబోయే ప్రధాని అంటారు. ప్రతిపక్షాలు మాత్రం పప్పు అని గేలి చేస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా నెహ్రు - గాంధీ ఫ్యామిలీకి వారసుడు.. ముగ్గురు ప్రధానులు అయిన కుటుంబానికి.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  మరి అలాంటి రాహుల్ ను డేట్ చేయాలని ఉందంటూ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెప్పిందంటూ ఈమధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన కరీనా కపూర్ ఒకప్పుడు అలా అనుకున్నమాట నిజమని.. అదెప్పుడో చాలా కాలం క్రితం అని.. ఇప్పుడు అలాంటి ఫ్యాసినేషన్ ఏమీ లేదని చెప్పింది.  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను 2012 లో పెళ్లి చేసుకున్న కరీనాకు ఒక బాబు. ఆ బాబు పేరు తైముర్ అలీ ఖాన్.  బాబు పుట్టిన తర్వాత రెండేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న కరీనా ఇప్పుడు మళ్ళీ పోయినేడాది బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలో లాంచ్ చేస్తారట.


Tags:    

Similar News