సిద్దార్ధ్ కొత్త పల్లవి పేస్ట్ అయిపోతుంది బాస్!
సిద్దార్ధ్ కెరీర్ కొంత కాలంగా ఆశించిన విధంగా సాగిన సంగతి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసిన ఆదరణకు నోచుకోలేదు.
సిద్దార్ధ్ కెరీర్ కొంత కాలంగా ఆశించిన విధంగా సాగిన సంగతి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసిన ఆదరణకు నోచుకోలేదు. ఆ మధ్య `చిన్నా` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకున్నాడు. అంతకు ముందు..ఆ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో సిద్దార్ద్ తన బాధని వివిధ సందర్భంల్లో బయట పెట్టే ప్రయత్నం చేసాడు. ఇండస్ట్రీ సహా ఆడియన్స్ పై కూడా నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి.
అలాగే ఇతర హీరోల సినిమా విజయాలపై..వాటి కలెక్షన్లపై పరోక్షంగా సెటైర్లు సైతం గుప్పించే ప్రయత్నాలు సైతం చేసాడు. కమర్శియల్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా? తాను ఆ ఛాన్స్ తీసుకోలేదని సమాజానికి సందేశాన్నిచ్చే సినిమాలు, చైతన్య పరిచే సినిమాలు మాత్రమే చేస్తానని ఈ మధ్య కొత్త పల్లవి అందుకున్నాడు. హీరోయి న్లతో అసభ్య, అభ్యంతరక సన్నివేశాలున్న సినిమా అవకాశాలు వచ్చినా? వదులుకున్నానని..అలాంటి సినిమాల వల్ల సమాజాని ఉపయోగం ఏంటనే? ధోరణిలో మాట్లాడాడు.
తానొక్కడే ఉత్తముడిని అన్నట్లు వ్యాఖ్యానించి నెటిజనులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సిద్దార్ద్ కి హిపోక్రసీ అంటూ నెట్టింట కౌంటర్ ఎటాక్ మొదలైంది. సిద్దార్ధ్ నటించిన పాత సినిమాలు తీసి అందులో హీరోయిన్లతో అతగాడి రొమాంటిక్ యాంగిల్ ని బయట పెడుతూ రకరకల పోస్టులు పెడుతున్నారు. కెరీర్ ఆరంభంలో సిద్దార్ద్ రొమాటింక్ హీరో అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 'ఆట' సినిమాలో ఇలియానతో సిద్దార్ద్ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు హైలైట్ అవుతుంది.
ఇలియానా నడుంపై సిద్దార్ద్ చేతులు వేయడం...పాటల్లో ఇబ్బందికర భంగిమలో అభినయించిన తీరు చూసి! ఇతను సిద్దార్దే కదా? అని నెటిజనులు గుర్తు చేస్తున్నారు. సిద్దార్ధ్ తాజా వ్యాఖ్యలకు రొమాంటిక్ సన్నివేశాల్ని జత చేసి ట్రోల్ చేస్తున్నారు. `గృహం`, `నువ్వొస్తానంటే నొనద్దాంటానా` లాంటి చిత్రాల్లో సిద్దార్ద్ రొమాంటిక్ సన్నివేశాల్ని తీసి ఏకేస్తున్నారు. సిద్దార్ధ్ గతం మర్చిపోయాడని..అందుకే ఇలా గుర్తు చేస్తున్నామని పోస్టులు పెడుతున్నారు.