రానా దగ్గుబాటి `బాహుబలి`తో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి మొదలవుతోంది. ఇటీవల ప్రభు సోలొమన్ డైరెక్షన్ లో చేసిన `అరణ్య` ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. `1945` కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సోలో హీరోగా చేసిన ఈ రెండ చిత్రాలు రానాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన `భీమ్లానాయక్` తనకు క్రెడిట్ ని అందించలేకపోయింది.
పవన్ పాత్రని హైలైట్ చేయడంతో రానా పాత్రకు ప్రాముఖ్యత తగ్గింది. దీంతో సినిమా వన్ సైడ్ అయిపోయి పవన్ సినిమాగా మారిపోయింది. సక్సెస్ క్రెడిట్ కూడా పవన్ ఖాతాలోకే వెళ్లిపోయింది. డేనియల్ శేఖర్ గా ఈ సినిమాలో రానా ఓ రేంజ్ లో రక్తికట్టించినా ఫలితం మాత్రం పవన్ కే దక్కింది. ఇక సోలో హీరోగా నటించిన `విరాటపర్వం` అయినా విడుదలవుతుంది అంటే ఇంత వరకు ఈ సినిమా రిలీజ్ ఊసే లేదు.
వేణు ఊడుగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరితో కలిసి డి. సురేష్ బాబు నిర్మించారు. 90 వ దశకంలో ఉత్తర తెలంగాణ నేపథ్యంలో సాగిన నక్సల్ ఉద్యమం నేపథ్యంలో వాస్తవిక సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని అత్యంత పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.
గత ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేస్తామంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ ని వాయిదా వేశారు. అయితే ఇప్పటికీ భారీ చిత్రాలు విడుదలవుతున్నా ఈ మూవీని ఎప్పుడు థియేటర్లలోకి తీసుకురానున్నారన్నది మాత్రం మేకర్స్ ప్రకటించడం లేదు. ఓటీటీ అని లేదు థియేట్రికల్ రిలీజ్ వుంటుందని ఇలా రక రకాలుగా ఈ సినిమా పై వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం హీరో రానా రామానాయుడు స్టూడియో నిర్మాణం జరుగుతున్న తొలి రోజుల్లో కు సంబంధించిన ఓ ఫొటోని రీట్వీట్ చేసి `బిఫోర్ ది బిగినింగ్ అంటూ రెండు లవ్ ఎమోజీలని జత చేశాడు.
దీంతో ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. `బాహుబలి`కి ప్రీక్వెల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఓ అభిమాని ప్రశ్నిస్తే `అన్నా మన `విరాటపర్వం` రిలీజ్ అప్ డేట్ ఇవ్వండన్నా` అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. మర్చిపోండి వచ్చినప్పుడే చూద్దాం` అంటూ మరో అభిమాని అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీటిపై రానా స్పందించకపోవడం గమనార్హం. ఫ్యాన్స్ ట్వీట్ లకు స్పందించే రానా `విరాటపర్వం` రిలీజ్ పై ఫ్యాన్స్ ప్రశ్నిస్తే బదులు చెప్పకపోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.