టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టగా.. ఇప్పుడు చిన్న కొడుకు గణేష్ కూడా 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే బెల్లంకొండ బ్రదర్స్ ఇద్దరు కూడా కథల ఎంపికలో వేర్వేరు మార్గాల్లో వెళ్తుండటం గమనార్హం.
'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కెరీర్ ప్రారంభం నుంచి కూడా యాక్షన్ - మాస్ మసాలా సినిమాలతో మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. కానీ అతని తమ్ముడు గణేష్ మాత్రం అన్న కు పూర్తి వ్యతిరేకంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
బెల్లంకొండ గణేష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం "స్వాతిముత్యం". సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఇదొక వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రమని హామీ ఇచ్చాయి.
అలానే ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నిజానికి దర్శకుడు లక్ష్మణ్ 'స్వాతిముత్యం' కంటే ముందు ఓ మాస్ యాక్షన్ కథను గణేష్ కు నెరేట్ చేసాడు. అయితే బెల్లంకొండ బ్రదర్ మాత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహా సబ్జెక్ట్ కావాలని అడగడంతో.. ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ స్వయంగా వెల్లడించారు.
'స్వాతిముత్యం' తర్వాత గణేష్ 'నేను స్టూడెంట్ సర్!' అనే సినిమాతో రాబోతున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఎస్ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించాడు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమా. ఇలా గణేష్ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు.
మరోవైపు అతని సోదరుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం మాస్ బాటలో పయనిస్తున్నాడు. 'స్పీడున్నోడు' 'జయ జానకి నాయక' 'సాక్ష్యం' 'కవచం' 'అల్లుడు అదుర్స్'.. ఇలా దాదాపు సినిమాలన్నీ అదే జోనర్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లు అనిపిస్తాయి. అయితే ఇవే అల్లుడు శీను కి నార్త్ లో క్రేజ్ తెచ్చిపెట్టాయి.
బెల్లంకొండ శ్రీను నటించిన సినిమాలన్నీ హిందీలోకి డబ్ కాబడి.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో కలిసి.. బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
ఇలా బెల్లంకొండ బ్రదర్స్ లో అన్న మాస్ మసాలా సినిమాలు చేస్తుంటే.. తమ్ముడు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలు మరియు కంటెంట్ ఆధారిత స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటున్నారు. మరి మున్ముందు యువ హీరోలు సాయి శ్రీనివాస్ మరియు గణేష్ ప్రయాణం ఇండస్ట్రీలో ఎలా సాగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.