బ్యూటీలతో పిక్ కి బెల్లం హీరో లింక్

Update: 2019-03-06 06:47 GMT
సోషల్ మీడియాలో కోట్లాది జనానికి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేది ట్రాలింగ్ పేజెస్. రకరకాల ట్రెండ్స్ మీద రాజకీయ నాయకులు సినిమా తారలు ఒకరేమిటి ఏదైనా ఇష్యూ జరగడం ఆలస్యం ఎవరైనా వీళ్ళ దృష్టిలో పడ్డారా అంతే సంగతులు. మేమ్స్ పేరుతో పిక్స్ కి చిన్న చిన్న ఎఫెక్ట్స్ జోడించి క్షణాల్లో వైరల్ అయ్యేంత మ్యాటర్ ని అందులో జోడిస్తారు. ఇప్పుడు 4జి టెక్నాలజి విస్తృతమయ్యాక అందరికి వీటి గురించి తెలిశాయి. పైన చూసారుగా.

ఇటీవలే కెప్టెన్ మార్వెల్ అనే ఇంగ్లీష్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కం ప్రమోషన్ కోసం టాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా ఒక చోట ఇలా చేరారు. బాగా సందడి చేసి కలిసి పిక్స్ కూడా తీసుకున్నారు. సమంతా-కాజల్ అగర్వాల్-రకుల్ ప్రీత్ సింగ్- తమన్నా భాటియా ఇలా కళ్ళు చెదిరే అందగత్తెలంతా వచ్చేసరికి అక్కడున్న వారి ఆనందం మాములుగా లేదు. ఇక్కడే ట్రాలింగ్ వాళ్ళ కళ్ళు ఈ బ్యూటీస్ మీద పడ్డాయి. అంతే ఇదుగో ఇలా మేమ్ తయారు చేసారు.

ఈ నలుగురు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమాలోనో పాటలోనో నటించిన వాళ్ళే. ఎంత పారితోషికమైనా లెక్క చేయకుండా డిమాండ్ ఉన్న భామలను ఏరికోరి తెచ్చుకునే శ్రీనివాస్ ని జబర్దస్త్ స్టైల్ లో ఎఫెక్ట్ ఇచ్చి ఆ పాపలందరూ నావాళ్ళే నమ్మరెంట్రా బాబు అని ఓ డైలాగ్ జోడించారు. అంటే వీళ్ళు ఈ ఒక్క హీరోతోనే నటించారని కాదు. స్టార్లతో చేయడం కామనే కాని డెబ్యు మొదలుకుని ఇప్పటి దాకా సాయి శ్రీనివాస్ ప్రతి సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీసె ఉన్నారు. పూజా హెగ్డే అక్కడ లేదు కాని లేదంటే సాక్ష్యం లోగో కూడా వీటికి తోడయ్యేదే. మొత్తానికి తెరమీదే కాదు సోషల్ మీడియాలో కూడా బెల్లం హీరోకు ఓ రేంజ్ పాపులారిటీ ఉందన్న మాట
Tags:    

Similar News