బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. యాక్షన్ హీరోగా మాస్ లో తనని తాను నిరూపించుకోవాలని తపిస్తున్న హీరో. తొలి నుంచి అతడి వరుస అదే. `అల్లుడు శీను`తో అతడిని మాస్ స్టార్ గా తయారు చేయాలని వి.వి.వినాయక్ తపించాడు. తొలి సినిమా శీనుకి మంచి పేరు తెచ్చింది. కమర్షియల్ సినిమాలకు పనికొస్తాడనే మాట్లాడుకున్నారు. అయితే ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల పెట్టినదంతా తిరిగి రాలేదని ట్రేడ్ విశ్లేషించింది. అటుపై ద్వితీయ ప్రయత్నం `స్పీడున్నోడు` డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో `జయ జానకి నాయక` మరో ఫ్లాప్. దీంతో అతడి కెరీర్ విషయంలో ఏం జరుగుతోంది? అన్న సందిగ్ధత నెలకొంది. ఓవైపు కొడుకు కెరీర్ నిలబెట్టేందుకు డాడ్ బెల్లంకొండ సురేష్ రాజీ లేని ప్రయత్నంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
తరచి చూస్తే.. కెరీర్ లో అన్నీ పరాజయాలే. అందుకు కాస్ట్ ఫెయిల్యూర్ - భారీ బడ్జెట్లు కారణమన్న టాక్ వినిపించింది. ఒక అప్ కం హీరోని నమ్మి భారీ పెట్టుబడులు కుమ్మరించడంపైనా - హీరోయిన్లకు భారీ పారితోషికాలపైనా ఆసక్తికర చర్చ సాగింది. రీసెంట్ జయ జానకి తొలుత యావరేజ్ అన్నా కానీ - పెట్టుబడులు తిరిగి రాలేదని ట్రేడ్ తేల్చేసింది. అదంతా అటుంచితే మరో రెండ్రోజుల్లో(జూలై 27న) శ్రీనూ కెరీర్ కి ఎంతో ఇంపార్టెంట్ సినిమా `సాక్ష్యం` రిలీజవుతోంది. ఈ సినిమాతో శ్రీవాస్ అతడికి హిట్టు కట్టబెడతాడా? బెల్లంకొండ ఫ్యామిలీ ఆశల్ని నిలబెడతాడా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. `సాక్ష్యం` పంచభూతాల కాన్సెప్ట్ అంటూ ఊదరగొడుతున్నారు. పూర్తిగా యాక్షన్ ని - మాస్ ని నమ్ముకున్నారు. మరి పంచభూతాలే అతడిని నిలబెడతాయా? లేదా? అన్నది చూడాలి.