సినిమా పేర్ల విషయంలో హీరోలే కాదు... కొద్దిమంది డైరెక్టర్లు కూడా సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. ఇన్ని అక్షరాలున్న పేర్లే పెట్టాలని, ఫలానా అక్షరంతోనే పేరు మొదలవ్వాలని ఇలా రకరకాలుగా ఉంటాయి ఆ సెంటిమెంట్లు. నిజంగానే కొద్దిమందికి ఆ సెంటిమెంట్లు బాగా వర్కవుటవుతుంటాయి. తొలి నుంచీ టాలీవుడ్ సెంటిమెంట్లకు కేరాఫ్‌గా నిలుస్తోంది. అందుకే ఇప్పటికీ వాటిని అవుతున్నవాళ్లు కనిపిస్తున్నారు. కథానాయకుల్లో మహేష్‌కి మూడక్షరాల సెంటిమెంట్ ఉంది. గోపీచంద్‌కి సున్నా సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమా పేరుకి చివరగా సున్నా ఉంటే హిట్టయిపోతుందని పరిశ్రమలో చెప్పుకొంటుంటారు. అందుకు తగ్గట్టుగానే గోపీచంద్ ఆ తరహా పేర్లే పెడుతుంటారు. ఇలాంటి సెంటిమెంట్‌ని ఫాలో అయ్యే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎక్కువగా ఎస్ పేరుతో మొదలవుతుంటాయి. శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, స్వప్నలోకం, సుడిగాడు... ఇలాగన్నమాట. ఇప్పుడు మరోసారి ఆయన ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరునే తన సినిమాకి ఖరారు చేశాడు.
అల్లుడు శీనుగా తెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా భీమనేని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'సుందర పాండ్యన్`కి రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ శరవేగంగా సాగిపోతోంది. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. 'స్పీడున్నోడు'అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు తెలిసింది. టాలీవుడ్‌లో సునీల్ మొదలుకొని చాలామందికి సుందరపాండియన్ కథ చెప్పాడు భీమనేని. చివరికి బెల్లంకొండతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రీమేక్ సినిమాల విషయంలో భీమనేనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ఆయన సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడుతుంటుంది. ఇప్పుడు సుందరపాండియన్ రీమేక్‌కి కూడా మంచి క్రేజే ఉంది. అందుకే భీమనేని సొంతంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఆయన సెంటిమెంటు ఏ రేంజ్‌లో వర్కవుటవుతుందో చూడాలి.