ప్రముఖ ప్రొడ్యూసర్ నిర్మాత బెల్లకొండ సురేష్ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేకపోతున్నారా? మొన్నామధ్యన ''స్పీడున్నోడు'' సినిమా రిలీజ్ టైములో ఇదే విషయాన్ని అడిగితే.. నిర్మాత అన్నప్పుడు ఆటూపోటూ సహజమే అనేశారు బెల్లంకొండ. మరి ఇప్పుడు ఏమంటారో తెలియదు కాని.. కొటాక్ మహీంద్రా బ్యాంక్ వారు మాత్రం.. ఆయనకు దిమ్మతిరిగే షాకిచ్చారు.
ఫిలిం నగర్ లోని బెల్లంకొండ ఆఫీస్ ను గురువారం ఈవెనింగ్ కొటక్ మహీంద్రా బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. రూ.7 కోట్ల వరకు బ్యాంకు రుణం చెల్లించలేదని, అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక వడ్డీతో కలిపి మొత్తం రుణం దాదాపు 11 కోట్లు వరకు ఆయన బకాయి పడిపోయారట. ఇదంతా రికవర్ చేయడం కోసం ఆయన లగ్జరీ ఆఫీస్ బిల్డింగ్ ను సీజ్ చేసేశారు.
తెలుగులో ఆది - చెన్నకేశవరెడ్డి - లక్ష్మీనరసింహా వంటి హిట్లు రూపొందించిన బెల్లంకొండ.. ఆ మధ్యన జబర్ దస్త్ - అల్లుడు శీను - రభస వంటి సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. కొడుకు హీరో చేయాలనే తపన ఆయన్ను చాలానే ముంచింది అని ఫిలిం నగర్ టాక్. యవ్వారం ఆస్తి సీజ్ వరకు వచ్చిందంటే.. విషయం కాస్త సీరియస్ అనే చెప్పాలి. చూద్దాం బెల్లంకొండ ఏం చేస్తారో!!