సౌమిత్రా ఛటర్జీకి సీరియస్​.. వెంటిలేటర్​పై చికిత్స

Update: 2020-10-10 09:30 GMT
కరోనా మహమ్మారి సినీ ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. షూటింగ్ లు ఆగిపోయి ఎందరో నటులు రోడ్డున పడ్డారు. పలువురు సినీ నటులు, ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీ(85) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కొంతకాలం క్రితం ఆయనకు కరోనా సోకగా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శుక్రవారం ఆయనకు శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్​పై చికిత్సనందిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో ఆయనకు కోవిడ్‌ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్‌ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు అక్టోబర్‌ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని బెల్లెవ్‌ నర్సింగ్‌ హోంకు తరలించారు. సౌమిత్రా చటర్జీ ప్రస్తుతం అభియాన్ అనే సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ ఆపివేశారు.

ఇటీవల కరోనా నిబంధనలు సడలించడంతో ఆయన తిరిగి షూటింగ్​ ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఆయన ఆ పనిలోనే నిమగ్నం అయ్యారు. షూటింగ్​లోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సౌమిత్రా గొప్ప నటుడే కాక రచయిత కూడా .. ఆస్కార్​ విజేతలైన సత్యజిత్‌ రే, ఫెలుడాలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. అంతేకాక ఆయన స్వయంగా రాసిన ‘అషాని సంకేట్‌, ఘరే బైర్‌’, ‘అరణ్య దిన్‌ రాత్రి’, ‘చారులత’, ‘షాఖా ప్రోశాఖా’, ‘జిందర్‌ బండి’, ‘సాత్‌ పాక్‌ బంధ’ రచనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి.
Tags:    

Similar News