మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా- బెంగాల్ టైగర్. ఈనెల 10న రిలీజ్ కి వస్తోంది. పోటీ అనేదే లేకుండా టైగర్ సోలోగా వేటకు దిగుతోంది. ఈ సినిమా ఇద్దరికి అత్యంత కీలకం.
కిక్ 2 లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలో నటించిన రవితేజకు ఇది ఎంతో కీలకం. సేమ్ టైమ్ ఈ సినిమాతో తన సత్తా చాటి, గబ్బర్ సింగ్ బ్యాటిల్ కి సిసలైన సమాధానం చెప్పాలనుకుంటున్న సంపత్ కి అంతే కీలకం. అందుకే ఇటీవలి కాలంలో ఎంతో సహనంతో ఈ ఇద్దరూ హార్డ్ వర్క్ చేశారు. ఎట్టకేలకు ఫైనల్ ప్రొడక్ట్ రెడీ అయ్యింది. నిన్ననే సెన్సార్ ముంగిటకు వెళ్లింది బెంగాళ్ టైగర్. సెన్సార్ బృందం యుఎ సర్టిఫికెట్ ఇచ్చి గౌరవించింది. మాస్ మహారాజ్ కెరీర్ లోనే ఇదో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది టీమ్.
ఇప్పటికే టీజర్ కి చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఈసారి మాస్ రాజాలోని ఎనర్జీని సంపత్ పీక్స్ లో వినియోగించాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. పూర్తిగా బి - సి సెంటర్ల నుంచి రాజాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయన్న అంచనా వేస్తున్నారు. పోటీలో పెద్ద సినిమాలేవీ లేవు. సోలోగా రిలీజవుతోంది కాబట్టి ఓపెనింగ్స్‌కి ఢోఖా ఉండదని భావిస్తున్నారు.
సంపత్ నంది దర్శకత్వంలో ఏమైంది ఈ వేళ లాంటి హిట్ సినిమాని తెరకెక్కించిన కె.కె.రాధామోహన్ ఈ చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ప్రస్తుతం కుమారి 21 ఎఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద హవా చాటుతోంది. ఈ సినిమా తర్వాత అంత పెద్ద ఓపెనింగ్స్ తో దూసుకుపోయే సినిమా బెంగాల్ టైగర్ అవుతుందని భావిద్దాం.