అనుష్క స్టయిల్ కాపీ కొడుతున్న రవితేజ

Update: 2015-11-27 07:30 GMT
ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ రోజు రవితేజ - అనుష్కల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతుండాల్సింది. కానీ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో సైజ్ జీరో - బెంగాల్ టైగర్ సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ పెట్టుకున్నారు. సైజ్ జీరో షెడ్యూల్ ప్రకారం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తుంటే.. బెంగాల్ టైగర్ డిసెంబరు 10న థియేటర్లలోకి దిగుతున్నాడు. ఐతే ఈ డేట్ల విషయంలో చర్చలు జరిపిన టైంలోనే సైజ్ జీరో నిర్మాత నుంచి ప్రమోషనల్ ఐడియాస్ కొన్ని తీసుకున్నట్లున్నాడు బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్. అచ్చంగా ‘సైజ్ జీరో’ స్టయిల్లోనే ‘బెంగాల్ టైగర్’ను ప్రమోట్ చేయడం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది మరి.

‘సైజ్ జీరో’ దక్షిణాదిన తిరిగే అన్ని ప్రధాన రైళ్లలో భారీ స్థాయిలో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ట్రైన్లో - ప్రతి కంపార్ట్ మెంట్ లో సైజ్ జీరో పోస్టర్లతో మోతెక్కించేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తిరిగే ప్రతి రైల్లోనూ సైజ్ జీరో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి కొన్ని రోజులుగా. ఐతే అనుష్క సినిమాకు రైలు బండ్లను ఎంచుకుంటే.. మాస్ రాజా మూవీ కోసం బస్సుల మీద ఫోకస్ పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులపై బెంగాల్ టైగర్ పోస్టర్లను నింపేస్తున్నారు.

బస్సుల మీద ఇలా పోస్టర్లు వేయడం ఇది కొత్తేమీ కాదు కానీ.. ‘బెంగాల్ టైగర్’ విషయంలో మాత్రం ఇది భారీ స్థాయిలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేల బస్సులపై బెంగాల్ టైగర్ క్యాంపైనింగ్ మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో రోజుకు కోటి మంది దాకా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తారని.. అందుకే ఈ పబ్లిసిటీ అని ప్రెస్ నోట్ కూడా ఇచ్చాడు ప్రొడ్యూసర్. వచ్చే రెండు వారాల్లో మరింత భారీగా పబ్లిసిటీ చేసి మాంచి క్రేజ్ మధ్య ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో ఉన్నాడు నిర్మాత.
Tags:    

Similar News