బెంగాల్ టైగర్ భలే ఆఫరిచ్చాడు

Update: 2015-11-21 11:30 GMT
యువ గాయనీ గాయకులకు ‘బెంగాల్ టైగర్’ టీమ్ ఓ బంపరాఫర్ ఇచ్చింది. ఈ నెల 30న ‘బెంగాల్ టైగర్’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించబోతున్న నేపథ్యంలో నిర్మాత రాధా మోహన్ యువ సింగర్ల కోసం ఓ పోటీని ప్రకటించాడు. ఈ పోటీలో పాల్గొని మెప్పిస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీత దర్శకత్వంలో రాబోయే తర్వాతి సినిమాలో పాట పాడే ఛాన్స్ కొట్టేయొచ్చు.

బెంగాల్ టైగర్ సినిమాలో తమకిష్టమైన పాటను యువ గాయనీ గాయకులు పాడి ‘సౌండ్ క్లౌడ్’లో అప్ లోడ్ చేసి తమ వివరాల్ని అందులో పొందుపరచాలి. ఈ ట్రాక్స్ లోంచి మూడింటిని సంగీత దర్శకుడు భీమ్స్, ఇతర జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు. ఆ పాటలు పాడిన సింగర్ లను బెంగాల్ టైగర్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో సత్కరించడంతో పాటు క్యాష్ ప్రైజ్ అందజేస్తారు. అంతే కాదు.. భీమ్స్ సంగీతమందించబోయే తర్వాతి సినిమాలో వారికి పాటలు పాడే అవకాశం కూడా లభిస్తుంది.

ఏమైంది ఈ వేళ, రచ్చ సినిమాల ఫేమ్ సంపత్ నంది రూపొందించిన ‘బెంగాల్ టైగర్’ డిసెంబరు 10న విడుదల కాబోతున్న సంగతి తెలసిందే. రవితేజ పక్కా మాస్ మసాలా క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా - రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రాణె - అక్ష కీలక పాత్రలు పోషించారు.
Tags:    

Similar News