దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఎంతోమంది కరోనా మహమ్మారి బాధితులుగా మారుతున్నారు. సినీ నటులు కూడా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి కోయల్ మల్లిక్ తో సహా ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌అని తేలింది. కోయల్ తండ్రి ప్రముఖ బెంగాలీ నటుడు రంజిత్ మల్లిక్, తల్లి దీపా మల్లిక్, భర్త, నిర్మాత నిస్పాల్ సింగ్ సహా కుటుంబం మొత్తం కరోనా బారినపడినట్లు స్వయంగా నటి కోయల్ మల్లిక్ ట్విటర్ ద్వారా తెలియజేసారు. అలాగే ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగుంది అని , అందరూ సెల్ప్ క్వారంటైన్ లో ఉన్నామని తెలిపారు.
ఘోరే అండ్ బైరే, ఛాయా ఓ ఛాబీ వంటి చిత్రాలతో కోయల్ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2013లో నిర్మాత నిస్పాల్ సింగ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మే నెలలోనే ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకొని ఎంతో సంబంరపడింది . అయితే , ఆ తరువాత కొద్ది నెలల వ్యధిలోనే కుటుంబం మొత్తానికి కరోనా సోకడంపై పలువురు ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. దర్శక నిర్మాత సత్యజిత్ సేన్, నటులు విక్రమ్ ఛటర్జీ, జీత్ సహా పలువురు బెంగాలీ నటులు కోయల్ కుటుంబం కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకొవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కాగా , ఇప్పటికే టామ్ హాంక్స్ కిరణ్ కుమార్, జోవా మొరాని, గాయని కనికా కపూర్ సహా పలువురు ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.