వీడియో: ముళ్లును ముళ్లుతోనే తీసిన లేడీ ఎంపీ!

Update: 2020-04-26 04:34 GMT
ప్ర‌జా జీవ‌నంలో ఆమె బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో కొన‌సాగుతోంది. ఆవిడ గారి ప‌ద‌వి చిన్న‌దేమీ కాదు. దేశంలో నేటి జ‌న‌రేష‌న్ లో ట్రెండ్ సెట్టింగ్ లేడీ ఎంపీగా పాపుల‌రైంది. అయితే అలాంటి ప‌ద‌విలో ఉండి ఆవిడ క‌ష్ట‌కాలంలో ఎంత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఓవైపు క‌రోనా విధ్వంశం.. దానికి తోడు దేశం లాక్ డౌన్.. పేద‌లు.. కూలీలు క‌నీసం తిండికి లేక అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్తు వేళ ఆవిడ ఇంకెంత బాధ్య‌త‌గా ఉండాలి. కానీ త‌ను మాత్రం ఇవేవీ ప‌ట్ట‌కుండా టిక్ టాక్ వీడియోల‌తో బిజీబిజీగా ఉంది. పైగా పిక్క‌లపైకి డెనిమ్ షార్ట్ తొడుక్కుని తైత‌క్క‌లాడింది. అంతేనా టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్ లో న‌డుము అందాల్ని నాభి సొగ‌సుని ఆరాంగా ఆర‌బోస్తూ వీడియోలు రూపొందించింది. పైగా ఆ వీడియోల్ని సాటి పార్ల‌మెంటేరియ‌న్ కి షేర్ చేసింది.

ఇంకేం ఉంది?  నెటిజ‌నులు ఊరుకుంటారా?  తిత్తి తీశారు. తిట్టి త‌లంటేశారు. ఓవైపు లాక్ డౌన్ దెబ్బ‌కు తిండికి లేక‌ పేద‌లు అల్లాడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అలాంటి వాళ్ల‌కు క‌నీస నిత్యావ‌స‌రాలు అయినా ఇవ్వ‌కుండా ఇలా స‌మ‌యాన్ని టిక్ టాక్ కే అంకితం చేస్తావా? అంటూ ప‌లువురు నెటిజ‌నులు చెడామ‌డా తిట్టేశారు. ఇదంతా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్ తీరు తెన్నుల గురించే. ఇంత‌కీ అలా నెటిజ‌నం తిడుతున్నారు క‌దా అని ఏమైనా మారిందా? అంటే.. తొలి టిక్ టాక్ వీడియోపై తిట్ల దండ‌కం అందుకున్న‌వారికి షాకిస్తూ .. ముళ్లును ముళ్లుతోనే తీయాలి అన్న చందంగా వ్య‌వ‌హ‌రించారు.

పిక్క‌ల పైకి డెనిమ్ నిక్క‌రు ధ‌రించిన వీడియోతో మ‌రోసారి చెల‌రేగింది. ఇక డ్యాన్సులేస్తూ త‌న ఎన‌ర్జీని ఓ రేంజులో ఎలివేట్ చేసింది. అన్ని వీడియోల్ని నుస్రత్‌ తన టిక్‌టాక్‌ అకౌంట్ లో షేర్‌ చేశారు. `సేవేజ్‌ ఛాలెంజ్‌` హాష్‌ ట్యాగ్ తో వీడియోని పోస్ట్‌ చేసి సాటి నాయ‌కుడు‌ మిమిచక్రవర్తికి ట్యాగ్‌ చేశారు. ఇక ఈ వీడియోల‌పై చిర్రుబుర్రులాడిన నెటిజ‌నం త‌న నియోజ‌క‌వ‌ర్గం బ‌షీర్ హ‌త్ ని నుస్ర‌త్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. పేద‌ల‌కు క‌నీస రేష‌న్ ఇవ్వ‌డం కూడా మ‌రిచింద‌ని తిట్టేశారు. జ‌నం రేష‌న్ దొర‌క్క ఇండ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చి పోలీసుల చేతుల్లో దెబ్బ‌లు తింటుంటే వినోదం చూస్తోందా ఎంపీ గారు? అంటూ చెల‌రేగిపోతున్న వాళ్లు ఉన్నారు. మ‌రి ఇలాంటి వేళ స‌ద‌రు లేడీ ఎంపీ కాస్తంత స‌న్నివేశాన్ని అర్తం చేసుకోకుండా ఇలా చేయ‌డం ఏమైనా బావుందా? అన్న‌ది ఆలోచించాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News