వాళ్ల అర్జున్ రెడ్డికి హీరోయిన్ దొరికేసింది

Update: 2018-07-05 06:32 GMT
తెలుగులో గత ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్ లలో ఒకటిగా నిలిచిన అర్జున్ రెడ్డి అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కారణం హీరో హీరోయిన్ కెమిస్ట్రీ. మొదటి సినిమా అయినా కూడా హీరోయిన్ షాలిని పాండే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. బోల్డ్ సన్నివేశాల్లో కూడా అమ్మడు అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా సృష్టించిన సునామికి కోలీవుడ్ బాలీవుడ్ కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే.

వెంటనే కథను రీమేక్ చేయాలని చాలా పోటీ పడ్డారు. బాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక కోలీవుడ్ లో కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. విలక్షణ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ కథలో విక్రమ్ కొడుకు ధృవ్ నటిస్తున్నాడు. వర్మ అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నారు. అయితే కథలో హీరోయిన్ కోసం ఇన్ని రోజులు ఎన్నో ఆడిషన్స్ చేసిన చిత్ర యూనిట్ ఫైనల్ గా కోల్ కతా కు చెందిన మేఘ చౌదరి అనే మోడల్ ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని హీరో విక్రమ్ తెలిపాడు. ఇన్ని రోజులు బాల కేవలం హీరోకు సంబంధించిన సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించాడు.

ఇక ఇప్పుడు హీరోయిన్ కూడా సెట్ అవ్వడంతో అసలైన సన్నీవేశాలకు సంబంధించిన షెడ్యూల్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక మేఘ కు సంబంధించిన సీన్స్ కోసం మూడు వారల పాటు వర్క్ షాప్స్ నిర్వహిస్తారట. ఈ బ్యూటీ ఇప్పటికే సౌత్ లో కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం తెలుగులో కూడా ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
Tags:    

Similar News