కుర్రాళ్ల గుండెల్లో దీపిక‌ విద్యుదీక‌ర‌ణ‌

Update: 2022-12-12 15:43 GMT
పార్టీ సాంగ్ అంటే కిక్కివ్వాలి. అలాంటి పాట‌ల్లో స్పెష‌లిస్టుగా దీపిక ప‌దుకొనే చార్ట్ లో టాప్ పొజిష‌న్ లో ఉంది.  ఈ భామను యూత్ ఫేవ‌రెట్ గా నిల‌బెట్టిందే మంట‌లు పెట్టే పార్టీ సాంగ్స్ అన‌డంలో సందేహం లేదు. దీపిక అభిన‌యం అందాల ఆర‌బోత కుర్ర‌కారును అన్ని వేళ‌లా థియేట‌ర్ల వైపు లాక్కొచ్చింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తుంది. ఇక బికినీకి ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీ ఉన్న అంద‌గ‌త్తెగా దీపికకు ఉన్న‌ ఐడెంటిటీనే వేరు.

బికినీలు స్విమ్ సూట్ ల‌లో మంట‌లు పెట్ట‌డం ఈ భామ‌కు కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు గెహ్ర‌యాన్ చిత్రంలో దీపిక ఘాటైన స‌న్నివేశాల్లో గుండె గిల్లే డ్రెస్సింగ్ సెన్స్ తో అగ్గి రాజేసిన తీరును కుర్రాళ్లు ఇంకా మ‌ర్చిపోనే లేదు. ఇంత‌లోనే ఇప్పుడు వాట‌న్నిటినీ కొట్టేలా భేష‌ర‌మ్ రంగ్ సాంగ్ తో దూసుకొచ్చింది.

షారుఖ్ ఖాన్  చిత్రం `పఠాన్` నుండి మొద‌టి పాట‌ `బేషరమ్ రంగ్...` తాజాగా విడుదలైంది. ఇందులో దీపికా పదుకొణె అందాల విందు యువ‌త‌రానికి ఊపిరాడ‌నివ్వ‌ని ట్రీట్ అని చెప్పాలి. పొడుగు కాళ్ల సుందరి స్విమ్ సూట్ లు బికినీ లు ధ‌రించి ఒక్క‌సారిగా అగ్గి రాజేసింది. ఇక దీపిక ధ‌రించిన బంగారు వ‌ర్ణం బికినీ లుక్ హీట్ పుట్టించింద‌ని చెప్పాలి.

బికినీలు స్విమ్ సూట్ ల‌తో పార్టీ సాంగ్ ఆద్యంతం వేడెక్కించే కదలికలతో దీపిక మ‌తులు చెడ‌గొట్టింది. షారుఖ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులోను సూప‌ర్ ఫిట్ గా క‌నిపిస్తున్నారు. ష‌ర్ట్ లెస్ ఫోజుల‌తో ఖాన్ అద‌ర‌గొట్టాడు. అత‌డి 6 ప్యాక్ లుక్ వ్వావ్! అనిపిస్తుంది. దీపికతో  సాంగ్ లో ఖాన్  మార్క్ ఆహార్యం ఆక‌ట్టుకుంది. పఠాన్ నుంచి మొదటి పాటను వీక్షించిన ఖాన్ అభిమానుల్లో అంచ‌నాలు మ‌రో లెవ‌ల్ ని తాకాయి. దీపికా పదుకొనే ఈ అందమైన పార్టీ గీతంలో కింగ్ ఖాన్ తో విద్యుద్దీకరణ జ‌రిగేంత‌గా కెమిస్ట్రీని ప్రదర్శించిందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనే అభిమానులు సోష‌ల్ మీడియాల్లో ఈ పాట‌ను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ట్విటర్ లో  బేషరమ్ రంగ్ ట్రెండింగ్ లో ఉంది. కింగ్ ఖాన్ ను తిరిగి యాక్షన్ మోడ్ లో చూసే ఛాన్స్ ద‌క్కినుందుకు SRKians (షారూఖ్ ఫ్యాన్స్) అంతా ఖుషీగా ఉన్నారు. పాటలో SRK కి డ్యాన్సింగ్ పార్ట్ త‌క్కువ‌గా ఉండటంతో కొందరు నిరాశకు గురైనా కానీ... దీపికా పదుకొణె  హాటెస్ట్ అవతార్ ని చూసి అందరూ మురిసిపోతున్నారు.

పఠాన్ పాట బేషరమ్ రంగ్ విడుదలకు ముందు షారూఖ్ ఖాన్ వైష్ణో దేవి ఆలయానికి ఆశీర్వాదం కోసం వెళ్లాడని క‌థ‌నాలొచ్చాయి. జీరో లాంటి ఫ్లాప్ ని చ‌వి చూశాక‌.. ప్ర‌స్తుత క్లిష్ఠ కాలంలో ప‌ఠాన్ విజ‌యం బాలీవుడ్  కి చాలా అవ‌స‌రం. ఘాటైన‌ విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఖాన్ కి ఇప్పుడు ఈ మూవీ ఎంతో కీల‌కం. అందుకే అత‌డు ప‌ఠాన్ పై ఎంతో శ్ర‌ద్ధ పెట్టి ప‌ని చేస్తున్నాడు. ఖాన్ ని తిరిగి రీబూట్ చేసే చిత్రంగా ప‌ఠాన్ నిలుస్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని ప‌రాజ‌యాల‌తో విసిగిపోయిన దీపిక‌కు కూడా ఇప్పుడు మంచి రిలీఫ్ కావాలంటే ప‌ఠాన్ స‌క్సెస్ చాలా ఇంపార్టెంట్ అన‌డంలో సందేహం లేదు. పాట‌ల‌తో ప్ర‌చార కిక్కు పెంచారు. సినిమా ఆద్యంతం యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో ర‌క్తి క‌ట్టించేందుకు య‌ష్ రాజ్ ఫిలింస్ భారీ బ‌డ్జెట్ ని కుమ్మ‌రిస్తోంది. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని ఏ లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తున్నారో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News