బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఎవరబ్బా?

Update: 2015-12-27 17:30 GMT
తెలుగు సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిన 2015 సంవత్సరం వెళ్లిపోతోంది. ఈ ఏడాది మన వెండితెరపై ఎన్నో అద్భుతాలు జరిగాయి. బాహుబలి - శ్రీమంతుడు లాంటి భారీ సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈసారి తెరపై కొత్తదనం పరవళ్లు తొక్కింది. ఎప్పట్లాగే ఈసారి కూడా కొందరు కొత్త దర్శకులు పరిచయమయ్యారు. వారిలో కొందరు బలమైన ముద్ర వేశారు. ఆ కొందరిలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఎవరన్నదే తేల్చాల్సి ఉంది.

ఈ ఏడాది అనిల్ రావిపూడి (పటాస్) - శ్రీరామ్ ఆదిత్య - (భలే మంచి రోజు) - రాధాకృష్ణ కుమార్ (జిల్) - కృష్ణ విజయ్ (అసుర) - నాగ్ అశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం) - శ్రీనివాస్ రెడ్డి (శివమ్) - వంశీ కృష్ణ (దొంగాట) - కార్తీక్ ఘట్టమనేని (సూర్య వెర్సస్ సూర్య) - సత్య దేవ్ (లయన్) - కార్తీక్ వర్మ (భమ్ బోలేనాథ్) - ఉదయ్ నందనవనం (శంకరాభరణం) - రామ్మోహన్ (తను నేను) - ప్రేమ్ సాయి (కొరియర్ బాయ్ కళ్యాణ్) - విప్లవ్ (హితుడు) లాంటి కొత్త దర్శకులు పరిచయమయ్యారు. వీరిలో తొలి సినిమాతో సక్సెస్ కొట్టింది తక్కువమందే. అందర్లోకి అనిల్ అతి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. రాధాకృష్ణ - కృష్ణవిజయ్ - నాగ్ అశ్విన్ కూడా ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ల సినిమాలు మరీ పెద్ద సక్సెస్ కాకున్నా.. బాగానే ఆడాయి. మిగతా డెబ్యూ డైరెక్టర్లు నిరాశ పరిచారు. ఇక అందర్లోకి బెస్ట్ ఎవరు అంటే.. కమర్షియల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి, క్రిటికల్ అక్లైమ్ దక్కించుకున్న దర్శకుడిగా శ్రీరామ్ కు అగ్ర తాంబూలం ఇవ్వాలేమో.
Tags:    

Similar News