బిచ్చగాడు అనే పేరుతో ఓ తమిళ డబ్బింగ్ సినిమా వచ్చినపుడు మొదట్లో జనాలకు అస్సలు పట్టలేదు. కానీ ‘బ్రహ్మోత్సవం’ దెబ్బ తాళలేక ‘బిచ్చగాడు’ మీద ఓ లుక్కేస్తే కానీ.. ఆ సినిమా గొప్పదనం అర్థం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చాలా నామమాత్రంగా థియేటర్లిచ్చారు ఆ సినిమాకు. కానీ తర్వాత తర్వాత వేరే సినిమాల స్క్రీన్లను కూడా అదే లాక్కుంది. ఏ థియేటర్లో కలెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నా.. అక్కడ బిచ్చగాడు వేసేసి వసూళ్ల పంట పండించుకున్నారు ఎగ్జిబిటర్లు. ఆ సినిమా పుణ్యమా అని విజయ్ ఆంటోనీకి తెలుగులో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అతడి తర్వాతి సినిమా ‘బేతాళుడు’కు మంచి హైప్ వచ్చింది. ‘బిచ్చగాడు’ డబ్బింగ్ హక్కులు రూ.30 లక్షలకు సొంతమైతే.. ‘బేతాళుడు’ కోసం రూ.3 కోట్లు పెట్టాల్సి వచ్చింది.
ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బేతాళుడు’ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్క్రీన్లు దక్కాయి. ఏకంగా 500 థియేటర్లలో ఈ చిత్రం రిలీజవుతోంది. రజినీకాంత్ - సూర్య లాంటి హీరోలకు తప్పిస్తే తెలుగులో ఓ డబ్బింగ్ సినిమాకు ఇన్ని స్క్రీన్లు ఇవ్వడం అన్నది అసాధ్యం. సినిమా మీద మంచి అంచనాలుండటంతో పాటు.. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోవడం ‘బేతాళుడు’కు కలిసొచ్చింది. ఈ వారం మరో డబ్బింగ్ మూవీ ‘మన్యం పులి’తో పాటు సాయిరాం శంకర్ సినిమా ‘అరకు రోడ్లో’ కూడా రిలీజవుతున్నాయి. కానీ ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా ‘బేతాళుడు’ మీదే ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే విజయ్ ఆంటోనీ మరోసారి వసూళ్ల పంట పండించేలాగే ఉన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/