సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్: 12 రోజుల్లో అసలు లెక్క ఇది!

ఈ గడచిన 12 రోజుల్లోనే 260 కోట్ల మార్క్‌ను దాటడం చిత్ర విజయాన్ని మరింత బలపరుస్తోంది. అంతేకాకుండా, నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా సంక్రాంతికి వస్తున్నాం అదరగొట్టింది.

Update: 2025-01-26 06:30 GMT

సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా మార్చిన విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని సాధిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పండుగ సందర్బంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘన విజయం సాధించింది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, ఇప్పటి వరకు కలెక్షన్లలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

 

ఇక రెండవ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. చాలా కాలం తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాస్ స్టాప్ గా థియేటర్స్ కళకళలాడుతూ ఉన్నాయి. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో 260 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్‌, విశాఖ వంటి ఏరియాల్లో కొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది.

శనివారం రోజునే బుక్ మై షోలో 1.7 లక్షల టిక్కెట్లు అమ్ముడవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు పడటమే కాకుండా, ప్రీమియం స్క్రీన్లకు బుకింగ్స్ పెరుగుతుండటం సినిమా విజయానికి మరింత ఊపునిచ్చింది. దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం, నిర్మాతలకు, పంపిణీదారులకు రెట్టింపు లాభాలు అందిస్తోంది.

సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలను పూర్తిగా అందుకోవడంతో పాటు, భారీ గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ గడచిన 12 రోజుల్లోనే 260 కోట్ల మార్క్‌ను దాటడం చిత్ర విజయాన్ని మరింత బలపరుస్తోంది. అంతేకాకుండా, నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా సంక్రాంతికి వస్తున్నాం అదరగొట్టింది. ఈ సినిమా అక్కడ ఇప్పటి వరకు $2.6 మిలియన్ డాలర్లను రాబట్టింది.

3 మిలియన్ క్లబ్‌లో చేరేందుకు ఇది మంచి ట్రాక్ ను సెట్ చేసింది. వెంకటేష్ కెరీర్‌లోనే ఓవర్సీస్‌లో అత్యుత్తమ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కుటుంబ ప్రేక్షకుల మద్దతు అని చెప్పొచ్చు. వారు ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి ఆదరించడం వల్ల రికార్డులు బ్లాస్ట్ అయ్యాయి. ఇక రిపిటెడ్ ఆడియెన్స్ కూడా భారీగా పెరిగారు.

ఈ విజయాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం ఈరోజు భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం సంబరం పేరుతో భారీ వేడుక నిర్వహిస్తోంది. ఈ వేడుకలో అభిమానులకు ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ, చిత్ర బృందం మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ సినిమా ఎంతవరకు రానిస్తుందో చూడాలి.

Tags:    

Similar News